ఏపీ అసెంబ్లీలో విద్యుత్ ఒప్పందాలపై రచ్చ

ఆర్థిక మంత్రి బుగ్గన ఇచ్చిన సమాధానంపై టీడీపీ ఎమ్మెల్యేలు సభలో ఆందోళనకు దిగారు. తమకు కూడా మరోసారి మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ నిరసనకు దిగారు. దీంతో స్పీకర్ తమ్మినేని వారిని సముదాయించే పనిలో పడ్డారు.

news18-telugu
Updated: December 9, 2019, 9:36 AM IST
ఏపీ అసెంబ్లీలో విద్యుత్ ఒప్పందాలపై రచ్చ
ఏపీ అసెంబ్లీలో వైఎస్ జగన్
  • Share this:
ఏపీ శీతకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంరోజే వాడివేడిగా మొదలయ్యాయి. సభల మొదటిరోజే పీపీఏలపై అధికార, ప్రతిపక్ష కమిటీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. పీపీఏలపై ఈ ఆరునెలల్లో ఏం చేశాచని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల ప్రశ్నించారు. దీనికి ఆర్థికశాఖ మంత్రి బుగ్గన సమాధానమిచ్చారు. పీపీఏలపై ఉన్నత స్థాయి కమిటీ సమీక్షిస్తోందన్నారు బుగ్గన. ఈ కమిటీల వల్ల ఏపీకి తీవ్ర నష్టం జరుగుతుందని అచ్చెంనాయుడు విమర్శించారు. పీపీఏలపై వేసిన కమిటీపై అచ్చెన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. పీపీఏల సమీక్షతో దేశానికి నష్టమని కేంద్రం చెబుతోందన్నారు.

అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై స్పందిస్తూ... మరోసారి బుగ్గన మాట్లాడారు. అసలు పీపీఏలపై ఎందకు కమిటీ వేశామో చెప్పామన్నారు. వాస్తవాలు చెబితే టీడీపీ ఒప్పుకోదన్నారు. గత ప్రభుత్వం డిస్కంలను ముంచేసింది. డిస్కంలను మొత్తానికి కుప్పకూల్చే పరిస్థితికి వచ్చిందన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై గత ప్రభుత్వం హడావుడి నిర్ణయాలు తీసుకున్నారన్నారు బుగ్గన. ప్రతీ దాన్ని రాజకీయం చేయోద్దంటూ బుగ్గన టీడీపీకి సూచించారు. ఆర్థిక మంత్రి బుగ్గన ఇచ్చిన సమాధానంపై టీడీపీ ఎమ్మెల్యేలు సభలో ఆందోళనకు దిగారు. తమకు కూడా మరోసారి మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ నిరసనకు దిగారు. దీంతో స్పీకర్ తమ్మినేని వారిని సముదాయించే పనిలో పడ్డారు.

First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>