సెలక్ట్ కమిటీకి రాజధాని బిల్లులు... జగన్ ముందున్న ఆప్షన్లు ఏంటి?

ప్రభుత్వం న్యాయనిపుణుల సలహాలు కూడా తీసుకుంటుంది. అడ్వొకేట్ జనరల్ శ్రీరాం సుబ్రమణ్యంతో కూడా చర్చలు జరిపింది.

news18-telugu
Updated: January 22, 2020, 10:37 PM IST
సెలక్ట్ కమిటీకి రాజధాని బిల్లులు... జగన్ ముందున్న ఆప్షన్లు ఏంటి?
సీఎం జగన్
  • Share this:
ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చారు. రాజధాని, అభివృద్ది వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపారు. తన విచక్షణాధికారంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో రాజధాని తరలింపుపై బ్రేక్ పడింది. అయితే, ఇప్పుడు జగన్ ఏం చేస్తారనే ఆసక్తి, చర్చ అందరిలోనూ మొదలైంది.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం... జగన్ మోహన్ రెడ్డి ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. అందులో మొదటిది శాసనమండలి చైర్మన్ చెప్పిన ప్రకారం సెలక్ట్ కమిటీని నియమించి ఆ కమిటీ నివేదిక వచ్చే వరకు ఆగాలి. అసెంబ్లీ రూల్స్ ప్రకారం సెలక్ట్ కమిటీకి పంపిన ఏ బిల్లులు అయినా కనీసం నెల రోజుల పాటు ఆగుతాయి. అత్యధికంగా మూడు నెలల పాటు ఆపొచ్చు. అంటే, కనీసం నెల రోజుల పాటు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సెలక్ట్ కమిటీ మార్పులు, చేర్పులు సూచిస్తే మళ్లీ అసెంబ్లీ, శాసనమండలిలో చర్చించి ఆమోదం పొందాలి.

ఇక రెండో ఆప్షన్ ఏంటంటే.. సెలక్ట్ కమిటీకి బిల్లును పంపకుండా నేరుగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి మూడు రాజధానులను ఏర్పాటు చేయడం. ఏదైనా ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని ఆరు నెలల్లోపు చట్టం చేసుకోవచ్చు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపు దాన్ని ఆమోదింపజేసుకోవచ్చు. అయితే, అప్పుడు కూడా మళ్లీ ఇదే సమస్య వచ్చే అవకాశం లేకపోలేదు.

మరోవైపు అసలు ఆర్డినెన్స్ తీసుకురావాలంటే కూడా సమస్య ఉంటుంది. ఏదైనా బిల్లు ఆమోదం పొందకపోతే అప్పుడు బిల్లు స్థానంలో ఆర్డినెన్స్ తీసుకొస్తారు. ప్రస్తుతం ఈ రెండు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడం అంటే ఆ రెండు బిల్లులు సజీవంగా ఉన్నట్టే లెక్క. ఆ ప్రకారం ఆర్డినెన్స్ తీసుకురావడం కుదిరేపని కాదు.అయితే, ఏ మార్గంలో వెళితే తాము అనుకున్న ప్రాజెక్ట్ త్వరగా పూర్తవుతుందో తెలుసుకోవడానికి ప్రభుత్వం న్యాయనిపుణుల సలహాలు కూడా తీసుకుంటుంది. అడ్వొకేట్ జనరల్ శ్రీరాం సుబ్రమణ్యంతో కూడా చర్చలు జరిపింది.
First published: January 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు