కోడెల ఫర్నిచర్ ఎఫెక్ట్... అధికారిపై బదిలీ వేటు

ఏపీ అసెంబ్లీ ఫర్నిచర్‌ను కోడెల తన నివాసానికి తరలించుకుపోవడంపై విచారణ కొనసాగుతోంది.

news18-telugu
Updated: August 22, 2019, 1:32 PM IST
కోడెల ఫర్నిచర్ ఎఫెక్ట్... అధికారిపై బదిలీ వేటు
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు
  • Share this:
అసెంబ్లీ ఫర్నీచర్‌ను తన నివాసాలకు తరలించుకున్న ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా అసెంబ్లీ చీఫ్ మార్షల్‌ గణేశ్ బాబుపై ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ప్రస్తుతం అసెంబ్లీ చీఫ్ మార్షల్‌గా ఉన్న గణేశ్ బాబును అక్టోపస్‌కు బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం. అసెంబ్లీ సామాగ్రిని కోడెల శివప్రసాద్ రావు నివాసాలకు తరలించడం వెనుక చీఫ్ మార్షల్ గణేశ్ బాబు పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై సీరియస్‌గా దృష్టి సారించిన ఏపీ సర్కార్... దీనిపై విచారణ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది.

టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో హైదరాబాద్‌లో ఉన్న అసెంబ్లీని అమరావతికి తరలించారు. అయితే ఆ సమయంలో అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచర్‌లో కొంతమేర కోడెల శివప్రసాదరావు తన సొంత నివాసాలకు తరలించుకున్నారు. అప్పటి అసెంబ్లీ స్పీకర్‌గా కోడెల శివ ప్రసాద్ కొన్నింటిని సత్తెనపల్లి, నర్సరావుపేటకు తరలించుకున్నారు. అసెంబ్లీ కార్యదర్శి పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన కోడెల... ఫర్నీచర్‌ను తన నివాసానికి తరలించిన విషయం వాస్తవమే అని అంగీకరించారు.

First published: August 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>