నేతల జంపింగ్ జపాంగ్... తాజాగా ఎవరు ఏ పార్టీల్లోకి...

ప్రతీకాత్మక చిత్రం

Lok Sabha Elections 2019 : ఎన్నికలప్పుడు చూడాలి నేతల ఎత్తుగడలు... ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయో లేవో అన్న డౌట్ రాక మానదు.

  • Share this:
సబితా ఇంద్రారెడ్డి : కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారు. ఆమెకు మంత్రి పదవితోపాటు కొడుకు కార్తీక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు టీఆర్‌ఎస్‌ నుంచి హామీ రావడంతో కాంగ్రెస్‌కి ఇవాళో, రేపో గుడ్‌పై చెప్పబోతున్నారు. నెక్ట్స్ ఏం చేస్తారన్నది ఇవాళ చెప్పే అవకాశాలున్నాయి. నిజానికి సబిత పార్టీని వీడనుండటం కాంగ్రెస్‌లో ఎవరికీ ఇష్టం లేదు. ఆమె కాంగ్రెస్‌లోనే ఉండాలని ఆ పార్టీ నేతలు బుజ్జగించేందుకు ప్రయత్నించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్‌ నేత జానారెడ్డి, రేవంత్‌రెడ్డి వంటి వారు ఆమె ఇంటికి వెళ్లి నచ్చజెప్పినా ఆమె వెనక్కి తగ్గలేదు. ఉత్తమ్‌ వ్యవహార శైలితోపాటు... జిల్లాలో రాజకీయ పరిణామాలతో సబిత, కార్తీక్‌ ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌ నుంచి మంత్రి పదవి, కొడుక్కి రాజకీయ భవిష్యత్తుపై కేసీఆర్, కేటీఆర్, కవితల నుంచి హామీ రావడంతో పార్టీ మారబోతున్నట్లు తెలిసింది.

తోట నరసింహం : ఎంపీ తోట నరసింహం టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఇవాళ వైసీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. తన భార్య వాణి, వైసీపీ తరపున ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్దాపురం పోటీ చేస్తారని తెలిపారు. 2004లో కాంగ్రెస్‌లో చేరిన ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టారు. 2014లో టీడీపీలో చేరి కాకినాడ ఎంపీ అయ్యారు. కార్యకర్తలు కోరినట్లు వైసీపీలో చేరుతున్నట్లు వివరించారు.

మాగుంట శ్రీనివాస్ రెడ్డి : ప్రకాశం జిల్లాకు చెందిన కీలక నేత, టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ వైసీపీలో చేరతారని తెలుస్తోంది. ఆయన వైసీపీ కండువా కప్పుకుంటే ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ అధినేత జగన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీచేసి గెలిచిన జగన్ బాబాయ్, వైసీపీ మాజీ ఎంపీని రాజ్యసభకు లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారని తెలుస్తోంది. బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో ఉన్న విభేదాలే వైవీ సుబ్బారెడ్డికి టికెట్ ఇవ్వకపోవడానికి కారణాలని పుకార్లు వస్తున్నాయి.

గంటా శ్రీనివాసరావు : విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం టీడీపీ కీలక నేత, మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా పార్టీని వీడటానికి సిద్ధమైనట్టు తెలిసింది. భీమిలి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఆయనకు తిరిగి అక్కడి నుంచి పోటీ చేసేందుకు పార్టీ నుంచి హామీ లభించకపోవడం... సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణకు ఆ టిక్కెట్ దాదాపుగా ఖాయమైపోయిందన్న ప్రచారం కారణంగా గంటా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇవాళో, రేపో ఆయన వైసీపీలో చేరడం లాంఛనమే అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి : కర్నూలు జిల్లాలో కాంగ్రెస్‌కు షాకిస్తూ మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పబోతున్నారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరాపై ఇంతెత్తున లేచిన ఆయన... ఎన్నికల్లో ఓడిపోయే వాళ్లను రఘువీరా ఎంపిక చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. అనుచరులతో చర్చించాక, నెక్ట్స్ ఏంటి అన్నది డిసైడ్ చేసుకుంటానన్నారు. అటు కాంగ్రెస్ కూడా సీరియస్‌గా రియాక్టైంది. బైరెడ్డిని పార్టీ ఉపాధ్యక్ష పదవి నుంచీ, ప్రాథమిక సభ్యత్వం నుంచీ బహిష్కరిస్తున్నట్లు పార్టీ క్రమశిక్షణా సంఘం ప్రకటించింది.

 

ఇవి కూడా చదవండి :

Ind vs Aus 5th ODI : ఢిల్లీలో భారత్ ఆస్ట్రేలియా ఐదో వన్డే... గెలిచిన జట్టుదే సిరీస్

శనగపిండి షర్బత్ ట్రై చేశారా... ఎండాకాలంలో తాగాల్సిన డ్రింక్

పుచ్చకాయ కొయ్యకుండానే ఎర్రగా ఉందో లేదో గుర్తించడం ఎలా... ఇలా...

ఇంట్లో నెమలి పించం ఉందా... మీకు కలిగే ప్రయోజనాలు ఏవంటే...
First published: