ఈవీఎంలతో ఏదైనా చేయొచ్చు... బీజేపీ నేత సంచలన ఆరోపణలు...

పశ్చిమ బెంగాల్లో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైంది.

news18-telugu
Updated: November 29, 2019, 6:06 PM IST
ఈవీఎంలతో ఏదైనా చేయొచ్చు... బీజేపీ నేత సంచలన ఆరోపణలు...
ఈవీఎంలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల మీద బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. ఈవీఎంలతో ఏమైనా జరగొచ్చని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి రాహుల్ సిన్హా ఆరోపించారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోజరిగిన ఉప ఎన్నికల్లో మూడు సీట్లలోనూ బీజేపీ ఓడిపోయింది. దీనిపై బీజేపీ నేత రాహుల్ సిన్హా స్పందించారు. ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌ను గెలిపించడానికి అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేసిందని అనుమానం వ్యక్తం చేశారు. టీఎంసీ మీద ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ‘ఎన్నికల ప్రక్రియను ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షిస్తుంది. కానీ, క్షేత్రస్థాయిలో పనులను మాత్రం నిర్వహించేది రాష్ట్ర ప్రభుత్వమే. ఎన్నికల్లో గెలవడానికి టీఎంసీ ఏమైనా చేస్తుంది.’ అని ఆరోపించారు. ఈవీఎంలతో ఏమైనా చేయొచ్చని చెప్పారు. ‘ఈవీఎంలతో ఏమైనా చేయొచ్చు. ఎన్నికల కౌంటింగ్ సమయంలో అవకతవకలు జరగలేదని అనుకోలేం.’ అని రాహుల్ సిన్హా అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ప్రాంతాల్లో కూడా ఓడిపోవడం అనుమానం కలిగిస్తోందన్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని అందరూ భావించారని, అయితే, టీఎంసీ గెలవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.

తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈవీఎంల మీద విపక్షాలు పెద్ద ఎత్తున అభ్యంతరాలు తెలిపాయి. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడానికి ఆస్కారం ఉందని ఆరోపించాయి. అయితే, ప్రతిపక్షాల ఆరోపణలను ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. కావాలంటే ట్యాపరింగ్ చేసి చూపించాలంటూ విపక్షాలకు ఛాలెంజ్ చేసింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 29, 2019, 6:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading