ANY TIME AP CM YS JAGAN WILL GO TO JAIL BJP SENIOR LEADER SUNIL DEODHAR KEY COMMENTS TPT NGS
Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ కు త్వరలోనే జైలు శిక్ష: బీజేపీ జాతీయ కార్యదర్శి సంచలన వ్యాఖ్యలు
ఏపీ సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ త్వరలోనే జైలుకు వెళ్తారంటూ బీజేపీ సీనియర్ నేత సునీల్ దియోదర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ బెయిల్ ఎప్పుడైనా రద్దు అయ్యే అవకాశం ఉందన్నారు. ఏపీలో రౌడీ సీఎం పాలన ముగిసింది అన్నారు.
ఏపీలో వైసీపీ వర్సెస్ బీజేపీ వార్ ముదురుతోంది. మొన్నటి వరకు బీజేపీ నేతలను వైసీపీ నేతలు పెద్దగా ఎప్పుడు విమర్శించలేదు. కేవలం ప్రధాన ప్రతిపక్షం టీడీపీని మాత్రమే టార్గెట్ చేస్తూ వస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలోనూ ఉద్యమంలో పాల్గొన్నారు తప్పా.. ఎక్కడా కేంద్రాన్ని వైసీపీ నేతలు విమర్శించలేదు. కానీ తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగింది. ఇటు వైసీపీ నేతలు, అటు బీజేపీ నేతలు ఎవరూ వెనక్కు తగ్గడం లేదు. ఢీ అంటే ఢీ అంటున్నారు. ఒకానొక దశలో టీడీపీని పక్కన పెట్టి.. బీజేపీ, వైసీపీలే ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకుంటున్నారు. బీజేపీ నేతలు సైతం ఏపీలో వైసీపీకి ప్రధాన పోటీ బీజేపీ తోనే అని ప్రచారం చేస్తున్నారు.
ఇటీవల పాండిచ్చేరి మేనిఫెస్టోను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రిలీజ్ చేశారు. అయితే ఆ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా అంశం పెట్టడంపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎన్నికల కోసం బీజేపీ ఎన్ని అసత్య ప్రచారాలైనా చేస్తోందని ఆరోపిస్తున్నారు. మంత్రులు అంతా బీజేపీ తీరుపై మూకుమ్మడిగా దాడి చేశారు. పాండిచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతున్న కేంద్రం.. ఏపీకి ఎందుకు కుదరదని చెబుతోందని ప్రశ్నిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించిన తరువాతే బీజేపీ నేతలు ప్రచారానికి రావాలని డిమాండ్ చేస్తున్నారు. అటు బీజేపీ,జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థి పవనే అంటూ సోము వీర్రాజు ప్రకటించినప్పటి నుంచి ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం పెరిగింది. ఉప ఎన్నికకు ముఖ్యమంత్రికి సంబంధం ఏంటని మంత్రులు నిలదీస్తున్నారు. పవన్-బీజేపీ నేతలు తలకిందులుగా పాద యాత్ర చేసిన ఏం ఒరిగేది లేదంటున్నారు. అంటు ఎంపీ విజయసాయిరెడ్డి కూడా సోషల్ మీడియా వేదికగా బీజేపీపై సెటైర్లు వేస్తున్నారు.
వైసీపీ విమర్శలకు ధీటుగానే బీజేపీ కూడా కౌంటర్లు ఇస్తూ వస్తోంది. తాజాగా ఏపీ సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ థియోధర్. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న జగన్ ఏ క్షణమైనా జైలుకెళ్ళొచ్చు అని ఆయన జోస్యం చెప్పారు. జగన్ బెయిల్ ఏ క్షణమైనా రద్దయ్యే అవకాశం ఉందన్నారు. త్వరలోనే రౌడీ సీఎం పని అయిపోయిందని.. ఏపీలో ప్రత్యామ్నాయంగా బీజేపీ-జనసేన బలపడ్డాయి అన్నారు. జగన్ హయాంలో రాష్ట్రం ఇప్పటికే సర్వనాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీలో అవినీతి, అప్పులే మిగిలాయని ఆరోపించారు. బీజేపీ-జనసేన కూటమి మాత్రమే ఏపీని బంగారు ఆంధ్రప్రదేశ్ గా మార్చగలదన్నారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.