హోమ్ /వార్తలు /National రాజకీయం /

Bheemla Nayak: భీమ్లానాయక్ పై ఆగని పొలిటికల్ దుమారం.. కేసీఆర్‌, పవన్‌ ఫ్లెక్సీలు తొలగింపుపై వివాదం

Bheemla Nayak: భీమ్లానాయక్ పై ఆగని పొలిటికల్ దుమారం.. కేసీఆర్‌, పవన్‌ ఫ్లెక్సీలు తొలగింపుపై వివాదం

Bheemla nayak: బీమ్లా నాయక్ పై రాజకీయ దుమారం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే టికెట్ల వ్యవహారం రచ్చ రచ్చ అవుతోంది. తాజాగా ఫ్లెక్సీల తొలగింపు వివాదం మరో టర్న్ తీసుకుంటోంది.

Bheemla nayak: బీమ్లా నాయక్ పై రాజకీయ దుమారం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే టికెట్ల వ్యవహారం రచ్చ రచ్చ అవుతోంది. తాజాగా ఫ్లెక్సీల తొలగింపు వివాదం మరో టర్న్ తీసుకుంటోంది.

Bheemla nayak: బీమ్లా నాయక్ పై రాజకీయ దుమారం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే టికెట్ల వ్యవహారం రచ్చ రచ్చ అవుతోంది. తాజాగా ఫ్లెక్సీల తొలగింపు వివాదం మరో టర్న్ తీసుకుంటోంది.

  Bheemla Nayak:  భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమాను రాజకీయ వివాదం వీడడం లేదు. సినిమా రీలీజ్ కు ఒక రోజు ముందు మొదలైన గొడవ.. మూడో రోజు కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పరిస్థితి  భీమ్లానాయక్ వర్సస్ ఏపీ ప్రభుత్వం (AP Government) అన్న చందగా మారింది.  ఓ వైపు ప్రభుత్వం తమ చర్యలను సమర్థించుకుంటుంటే.. ఇటు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులు, జనసేన నేతలు.. విపక్షాలు సైతం భీమ్లానాయక్ కు మద్దతుగా మాట్లాడుతున్నా.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. జనసేన నేతలు ఓ అడుగు ముందుకు వేసి మరి ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జనసేన నేేత నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ.. జగన్ సర్కార్ అహంకారంపై పవన్ ఆత్మగౌరవం నెగ్గింది అంటూ కామెంట్ చేశారు.. ఇక మెగా బ్రదర్ నాగాబాబు మాట్లాడుతూ పవన్ మీద పగ పట్టి జగన్ సర్కార్ ఇలాంటి చర్యతకు పాల్పడుతోందని ఆరోపించారు.. ఏపీలో సినిమా టికెట్ల ధరలు పెంచకూడదని ఆదేశాలు ఉన్నాయి. ఐదో షోకు అనుమతి లేదు.. దీని తోడు.. రెవెన్యూ అధికారుల పర్యవేక్షన కూడా ఉంది. అయినా ఏపీలో పవన్ సినిమా సునామీ కలెక్షన్లు సాధిస్తుండడంతో జనసైనికుల ఆనందాన్ని హద్దే లేకుండా పోయింది.

  ఇదీ చదవండి: జ్యువెలరీ షాపులో భారీ చోరీలో ట్విస్ట్.. 24 గంటల్లోనే చేధించిన పోలీసులు..

  ఇలా పవన్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్న సమయంలో మరో వివాదం తెరపైకి వచ్చింది.  ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం భీమ్లా నాయక్ సినిమాపై ఆంక్షలు పెడితే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం శుభవార్తలపై శుభవార్తలు చెబుతోంది. ఇప్పటికే రెండు వారాల పాటు అదనపు షోలకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీలో చాలా చోట్ల హ్యాట్సాఫ్ సీఎం కేసీఆర్ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి..  ఈ ఫ్లెక్సీలే ఇప్పుడు మరో వివాదానికి కారణమైంది..

  ఇదీ చదవండి: ఇదేమైనా ఉత్తర కొరియా అనుకుంటున్నారా..? మీ అధికారానికి ఇదే డెడ్ లైన్.. ప్రభుత్వంపై నాగబాబు ఫైర్

  పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు విజయవాడలో తెలంగాణ సీఎం కేసీఆర్, పవన్‌ కల్యాణ్‌ల భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.  భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా తెలంగాణలో టిక్కెట్ ధరలు పెంచడం, ఐదో షోకు అనుమతులు ఇవ్వడాన్ని స్వాగతిస్తూ పవన్ అభిమానులు కేసీఆర్ మీద తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో హ్యాట్సాఫ్ సీఎం అంటూ విజయవాడ కృష్ణలంకలోని ఫైర్ స్టేషన్ సమీపంలో భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే విజ‌య‌వాడలోని కృష్ణలంక‌లో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ ఫ్లెక్సీని కార్పొరేష‌న్ సిబ్బంది తొల‌గించారు.

  ఇదీ చదవండి: : శ్రీశైలం శివరాత్రి శోభ.. శైవ క్షేత్రాన్ని ఏ మాసంలో దర్శిస్తే ఏం ఫలం కలుగుతుందో తెలుసా..?

  తెలంగాణ సీఎం కేసీఆర్, వంగవీటి మోహనరంగా, పవన్ కళ్యాణ్ చిత్రపాటలతో భారీ ఫ్లెక్సీలను పవన్ అభిమానులు ఏర్పాటు చేశారు. కేసీఆర్‌ను ఉద్దేశించి హ్యాట్సాఫ్ సీఎం సర్ అంటూ పోస్టింగ్ పెట్టారు. ఈ ఫ్లెక్సీ ఏర్పాటు విజయవాడలో చర్చనీయాంశంగా మారింది. ఫ్లెక్సీపై మీడియాలో కథనాలు రావడంతో కార్పొరేషన్ సిబ్బందిని పంపించి ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో పవన్‌ అభిమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  First published:

  Tags: Andhra Pradesh, AP News, Bheemla Nayak, Pawan kalyan

  ఉత్తమ కథలు