Antarvedi Chariot:అంతర్వేది రథంపై పవన్ కళ్యాణ్ కొత్త డిమాండ్

అంతర్వేది లక్ష్మీనరసింహుడి నూతన రథం నిర్మాణంలో అగ్నికుల క్షత్రీయులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: September 24, 2020, 1:40 PM IST
Antarvedi Chariot:అంతర్వేది రథంపై పవన్ కళ్యాణ్ కొత్త డిమాండ్
అంతర్వేది రథంపై పవన్ కళ్యాణ్ కొత్త డిమాండ్
  • Share this:
అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో రథం దగ్ధం మొన్నటి వరకు ఏపీలో తీవ్ర దుమారం రేగింది. ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించడంతో పాటు కొత్త రథాన్ని ప్రభుత్వమే నిర్మిస్తామని హామీ ఇవ్వడంతో.. బీజేపీ, జనసేనతో పాటు హిందూ సంఘాలు శాంతించాయి. ప్రస్తుతం కొత్త రథం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. అంతర్వేది లక్ష్మీనరసింహుడి నూతన రథం నిర్మాణంలో అగ్నికుల క్షత్రీయులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నూతన రథం నిర్మాణంలో ప్రభుత్వం ఆలయ సంప్రదాయాలు, స్థానికుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు జనసేనాని.

''అంతర్వేదిలో లక్ష్మీ నరసింహుడిని అగ్ని కులక్షత్రీయులు తమ కుల దైవంగా పూజిస్తుంటారు. ఈ ఆలయాన్ని అగ్నికుల క్షత్రీయుడైన కొపనాతి కృష్ణమ్మ నిర్మించిన సంగతి యావన్మందికి విదితమే. తొలి రథం కూడా కృష్ణమ్మ రూపొందించినదే. శిథిలావస్థకు చేరిన ఆ రథం స్థానంలో ఇటీవల అగ్నికి ఆహుతి అయిన రథం కూడా స్థానిక అగ్నికుల క్షత్రీయులు తయారుచేసినదే. ఇప్పుడు కొత్త రథం నిర్మాణంలో తమకు ప్రాధాన్యత లేకపోవడంపై అగ్నికుల క్షత్రీయ సంఘం వారు ఆవేదన చెందుతున్నారు. రథం రూపకల్పన కమిటీలో అగ్నికుల క్షత్రీయులకు ప్రాతినిధ్యం లేకపోవడం శోచనీయం. రథోత్సవం నాడు తొలి కొబ్బరికాయ కొట్టి రథాన్ని లాగేది అగ్నికుల క్షత్రీయులే. వారి మనోభావాలను గౌరవించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వారిని గౌరవిస్తూ రథం తయారీలో అగ్నికుల క్షత్రీయులను భాగస్వాములను చేయాలి.'' అని పవన్ కల్యాణ్ అన్నారు.



అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొత్త రథం నిర్మాణానికి ఆకృతి ఇప్పటికే ఆకృతి సిద్ధమైంది. రథం నిర్మాణంపై అన్ని వర్గాలతో చర్చించి ఆకృతిని తయారు చేయించామని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు. శిఖరంతో కలిపి కొత్త రథాన్ని 41 అడుగుల ఎత్తు వచ్చేలా ఆకృతి రూపొందించారు. ఆరు చక్రాలతో కూడిన ఈ రథాన్ని మొత్తాన్ని ఏడు అంతస్తుల్లా నిర్మిస్తున్నారు. కొత్త రథం నిర్మాణంతో పాటు రథశాల మరమ్మత్తుల కోసం రూ.95 లక్షలు ఖర్చవుతుందని దేవదాయశాఖ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు రూపొందించారు. పిబ్రవరి నాటికి రథాన్ని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి వెల్లంపల్లి.

కాగా, సెప్టెంబరు 5న సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రాంగణంలో ఉన్న దివ్య రథం అగ్నికి ఆహుతయింది. 60 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ రథం 40 ఎడుగుల ఎత్తు ఉంది. స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా ఏటా ఇక్కడ ఘనంగా రథోత్సవం నిర్వహిస్తారు. అలాంటి రథం మంటల్లో కాలిపోవడంతో భక్తులు భగ్గుమన్నారు. రథానికి మంటలు ప్రమాదవశాత్తు అంటుకున్నాయా? లేదంటే కుట్ర ఉందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీని వెనక హిందూ వ్యతిరేక శక్తుల కుట్ర ఉందని ఆరోపిస్తూ బీజేపీ, జనసేన, హిందూ సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. అంతేకాదు చలో అంతర్వేది కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ఏపీ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది.
Published by: Shiva Kumar Addula
First published: September 24, 2020, 1:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading