విజయవాడలో టీడీపీకి షాక్.. వైసీపీలో చేరనున్న మరో నేత..?

విజయవాడ తూర్పు, పెనమలూరు కాకుండా.. గుడివాడ నుంచి తనకు ఇష్టం లేకున్నా పోటీ చేయించారని అన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత తననూ, తన అనుచరులనూ టీడీపీ హైకమాండ్ పట్టించుకోవడం లేదని ఆయన అసంతృప్తితో ఉన్నారట.

news18-telugu
Updated: November 13, 2019, 9:58 PM IST
విజయవాడలో టీడీపీకి షాక్.. వైసీపీలో చేరనున్న మరో నేత..?
టీడీపీ గుర్తు, వైఎస్ జగన్
  • Share this:
ఏపీలో టీడీపీ వరుస షాక్‌లు తగులున్నాయి. నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. ఇప్పటికే ఆకరేషన్ ఆకర్ష్‌తో బీజేపీ ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా... ఇక మరికొందరు నేతలు అధికార పార్టీ వైసీపీలోకి వెళ్తున్నారు. తాజాగా విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ టీడీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన ఆయన.. వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గురువారం సాయంత్రం 4 గంటలకు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో అవినాష్ వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు

devineni avinash,devineni avinash quits tdp,devineni avinash nara lokesh,devineni avinash joins ysrcp,devineni avinash news,vijayawada news,devineni avinash biodata,దేవినేని అవినాష్,టీడీపీకి దేవినేని అవినాష్ గుడ్ బై,దేవినేని అవినాష్ నారా లోకేష్,దేవినేని అవినాష్ వైసీపీలో చేరిక,విజయవాడ వార్తలు,
చంద్రబాబునాయుడితో దేవినేని అవినాష్ (Image:Devineni Avinash/Twitter)


టీడీపీపై కొంతకాలంగా దేవినేని అవినాష్ అసంతృప్తితో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నానిపై తనను బలవంతంగా పోటీ చేయించారని అనుచరులతో పలు సందర్భాల్లో అవినాష్ చెప్పినట్లు సమాచారం. విజయవాడ తూర్పు, పెనమలూరు కాకుండా..  తనకు ఇష్టం లేకున్నాగుడివాడ నుంచి పోటీ చేయించారని అన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత తననూ, తన అనుచరులనూ టీడీపీ హైకమాండ్ పట్టించుకోవడం లేదని ఆయన అసంతృప్తితో ఉన్నారట. ఈ నేపథ్యంలోనే వైసీపీలో చేరేందుకు అవినాష్ రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

First published: November 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com