చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ..టీడీపీకి సీనియర్ నేత రాజీనామా

విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)కి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత టీడీపీకి గుడ్‌బై చెప్పారు.  సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు.

news18-telugu
Updated: September 27, 2020, 1:25 PM IST
చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ..టీడీపీకి సీనియర్ నేత రాజీనామా
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ)కి ఎదురుదెబ్బ తగిలింది.  పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. పార్టీలో తనకు తగిన గుర్తింపు ఇవ్వనందున ఆత్మగౌరవం కోసం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీకి సుదీర్ఘకాలంగా పనిచేసినా పార్టీలో తనకు తగిన గుర్తింపు దక్కడం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. పార్టీ నుంచి పొమ్మనలేక తనకు పొగపెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పదవులు ఇవ్వకపోయినా పర్వాలేదని..కనీసం పార్టీలో గౌరవం కూడా ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు.

telugu desam party, vijayanagaram tdp, gadde baburao news, gadde baburao resigns tdp, chandrababu naidu news, tdp news, ఏపీ రాజకీయాలు, విజయనగరం జిల్లా, టీడీపీ సీనియర్ నేత గద్దె బాబూరావు
గద్దె బాబూరావు


విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ జెండా పట్టిన మొట్టమొదటి వ్యక్తిని తానేనని గద్దె బాబూరావు అన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు అత్యంత ఆత్మీయుడిగా ఉన్నట్టు గుర్తుచేసుకున్నారు. నాడు ఆత్మ గౌరవ నినాదంతో పుట్టిన టీడీపీలో తనకు ఇప్పుడు అదే దక్కడం లేదని వ్యాఖ్యానించారు. 2004 నుంచి పార్టీలో తాను ఉన్నానో లేనో కూడా పార్టీ నేతలు గుర్తించడం లేదన్నారు. అందుకే టీడీపీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు టీడీపీ వేరు...ఇప్పడున్న టీడీపీ వేరని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు తమలాంటి సీనియర్ నాయకులకు పార్టీలో గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు.

telugu desam party, vijayanagaram tdp, gadde baburao news, gadde baburao resigns tdp, chandrababu naidu news, tdp news, ఏపీ రాజకీయాలు, విజయనగరం జిల్లా, టీడీపీ సీనియర్ నేత గద్దె బాబూరావు
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుతో గద్దె బాబూరావు(ఫైల్ ఫోటో)


2019 ఎన్నికల తర్వాత పలువురు పార్టీ నేతలు చంద్రబాబును వీడి బీజేపీ, అధికార వైసీపీలో చేరారు. ఇప్పుడు గద్దె బాబూరావు కూడా టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Published by: Janardhan V
First published: September 27, 2020, 1:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading