TSRTC Strike : గుండెపోటుతో మరో ఆర్టీసీ కార్మికుడు మృతి

RTC Employee death : రెండు రోజుల క్రితం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన అతను.. చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచాడు. ఆర్టీసీ కార్మికుడి మృతి పట్ల కార్మికులు సంతాపం వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: November 6, 2019, 11:10 AM IST
TSRTC Strike : గుండెపోటుతో మరో ఆర్టీసీ కార్మికుడు మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికుడు ప్రాణాలు వదిలాడు. కరీంనగర్ ఆర్టీసీ డిపో-2లో మెకానిక్‌గా పనిచేస్తున్న కరీం ఖాన్ గుండెపోటుతో మృతి చెందాడు. రెండు రోజుల క్రితం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన అతను.. చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచాడు. ఆర్టీసీ కార్మికుడి మృతి పట్ల కార్మికులు సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు ఆర్టీసీ సమ్మె నేడు 33వ రోజుకు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రితో ప్రభుత్వం విధించిన డెడ్‌ లైన్ పూర్తయింది. కేవలం 300 పైచిలుకు కార్మికులు మాత్రమే విధుల్లో చేరారు. సీఎం కేసీఆర్ డెడ్ లైన్‌కు కార్మికుల నుంచి స్పందన కరువవడంతో.. తదుపరి నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఆర్టీసీ భవితవ్యంపై మంత్రి పువ్వాడ అజయ్,ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మతో ఆయన చర్చించనున్నారు.

ఇదిలా ఉంటే, ఆర్టీసీ కార్మికులు నేడు దాదాపుగా 97 డిపోల్లో ఎక్కడికక్కడ బస్సులను అడ్డుకుంటున్నారు. సమ్మెను మరింత ఉధృతం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులతో పాటు వారి కుటుంబాలు,ప్రతిపక్ష పార్టీలు సమ్మెలో పాల్గొంటున్నారు.ముఖ్యమంత్రి ఇటువంటి డెడ్ లైన్లు ఎన్ని విధించినా వెనక్కి తగ్గేది లేదని హెచ్చరిస్తున్నారు. కేవలం 300 మంది కార్మికులే విధుల్లో చేరారంటే సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల ఎవరూ సానుకూలంగా లేరన్నది అర్థమవుతోందన్నారు. ఇప్పటికైనా సమస్యను మరింత జటిలం చేయకుండా డిమాండ్ల పరిష్కారానికి ఒప్పుకోవాలన్నారు.

First published: November 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>