TSRTC Strike : మరో ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌కి చెందిన ఆర్టీసీ డ్రైవర్ కేఎస్ రెడ్డి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు.

news18-telugu
Updated: November 10, 2019, 6:58 PM IST
TSRTC Strike : మరో ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు 37 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం దిగివచ్చే సూచనలు కనిపించడం లేదు.అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో ఆర్టీసీ కార్మికుల్లో ఆందోళన మరింత ఎక్కువైంది.ఈ నేపథ్యంలో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌కి చెందిన ఆర్టీసీ డ్రైవర్ కేఎస్ రెడ్డి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. కేఎస్ రెడ్డి ఆత్మహత్యాయత్నంపై కార్మిక వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ప్రభుత్వ వైఖరివల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉంటే,సోమవారం హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై విచారణ జరగనుంది. ప్రైవేటీకరణకు సంబంధించి కోర్టు కేబినెట్ ప్రొసీడింగ్స్ సమర్పించమని ఆదేశించడంతో.. ఆదివారం కూడా కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కోర్టులో వ్యవహరించాల్సిన తీరుపై అధికారులతో ఆయన చర్చించారు. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచన గురించి కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. మరోవైపు హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని కార్మికులు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Published by: Srinivas Mittapalli
First published: November 10, 2019, 6:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading