చింతమనేనికి షాక్... మరో కేసు నమోదు

రెండు రోజుల క్రితం జైలు నుంచి విడుదలైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై మరో కేసు నమోదైంది.

news18-telugu
Updated: November 18, 2019, 3:24 PM IST
చింతమనేనికి షాక్... మరో కేసు నమోదు
చింతమనేని ప్రభాకర్(ఫైల్ ఫోటో)
  • Share this:
రెండు నెలల పాటు జైలులో ఉండి... రెండు రోజుల క్రితం విడుదలైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు పోలీసులు మరో షాక్ ఇచ్చారు. జైలు నిబంధనలను ఉల్లంఘించి, పోలీసు విధులకు ఆటంకం కల్పించారనే అభియోగాలతో చింతమనేని ప్రభాకర్‌, మరికొందరిపై ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. 18 కేసుల్లో బెయిల్‌ పొంది ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం విడుదలయ్యారు చింతమనేని. జిల్లా జైలు నుంచి ర్యాలీగా దుగ్గిరాలలో ఉన్న ఇంటికి చేరుకున్నారు. జిల్లాలో పోలీసు యాక్ట్‌ 30 అమల్లో ఉన్న సమయంలో చింతమనేని ప్రభాకర్‌ ర్యాలీగా వస్తూ ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కల్పించారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి.

ఆ సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కల్పించారని, పోలీసు మోటారు వాహన చట్టాన్ని కూడా ఉల్లంగించారనే అభియోగాలతో ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. చింతమనేనితో పాటు టీడీపీ నేతల రవి, చలమోల అశోక్‌గౌడ్‌, దాసరి ఆంజనేయులు, వేంపాటి ప్రసాద్‌, మరికొందరిపై కేసు నమోదు చేశారు.






First published: November 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com