3 రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా.. కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు

ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాతో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల గెలుపు అవకాశాలు తగ్గనున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో రెండు సీట్లు గెలవాలన్న ఆ పార్టీ ఆశలు గల్లంతయ్యాయి.

news18-telugu
Updated: June 5, 2020, 2:48 PM IST
3 రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా.. కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. గుజరాత్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామా బాటపట్టారు. 3 రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పారు. బుధవారం ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. ఇవాళ మోర్బీ నియోజకవర్గ ఎమ్మెల్యే బ్రిజేష్ మెర్జా తన పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బ్రిజేష్ రాజీనామాను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది ఆమోదించారు. ఇక రెండు రోజుల క్రితం వడోదర ఎమ్మెల్యే అక్షయ్ పటేల్, కప్రాడా ఎమ్మెల్యే జితు చౌదురి తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.


గుజరాత్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు జూన్ 19న ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్‌ ఇద్దరు అభ్యర్ధులను బరిలో దింపగా, బీజేపీ నుంచి ముగ్గురు పోటీలో ఉన్నారు. గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్నాయి. అందులో బీజేపీకి 103 సభ్యుల బలముంది. కాంగ్రెస్ పార్టీ నుంచి 68 మంది గెలిచారు. ఇక భారతీయ ట్రైబల్‌ పార్టీ 2, ఎన్‌సీపీ, స్వతంత్రులు ఒక్కో స్థానాల్లో గెలుపొందారు. ఐతే మార్చిలో కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు రాజీనామా చేయగా.. తాజాగా మరో ముగ్గురు పార్టీని వీడారు. మొత్తం 8 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 60కి పడిపోయింది.

ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాతో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల గెలుపు అవకాశాలు తగ్గనున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో రెండు సీట్లు గెలవాలన్న ఆ పార్టీ ఆశలు గల్లంతయ్యాయి. దీని వెనక బీజేపీ కుట్ర ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఐతే ఇందులోకి తమను లాగవద్దని.. పార్టీపై అసంతృప్తితోనే రాజీనామా చేశారని బీజేపీ ఎదురుదాడి చేస్తోంది. కాగా, కాంగ్రెస్‌లో సంక్షోభాన్ని బీజేపీ తమకు అనుకూలంగా మలచుకుటోంది. తమ ముగ్గురు అభ్యర్థులను గెలిపించుకునేందుకు వేగంగా పావులు కదుపుతోంది.

First published: June 5, 2020, 2:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading