Home /News /politics /

ANOTHER EMPLOYEES DOING TIK TOK IN DUTY TIME AT KADIRI GOVT HOSPITAL SB

Tik Tok: ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది టిక్ టాక్... ఊడిన ఉద్యోగం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తాజాగా అనంతపురం కదిరి ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. కొందరు ఉద్యోగులు రోగుల్నిపట్టించుకోకుండా టిక్ టాక్ వీడియోలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు.

    టిక్ టాక పిచ్చి పీక్ స్టేజ్‌కు వెళ్లిపోతుంది. ఉన్న పనుల్ని మానేసి కొందరు అదేపనిగా టిక్ టాక్ వీడియోలు చేస్తూ...కాలం వెళ్లదీస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఈ విషయంలో ముందుంటున్నారు. తాజాగా అనంతపురం కదిరి ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది.  కొందరు ఉద్యోగులు రోగుల్నిపట్టించుకోకుండా టిక్ టాక్ వీడియోలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. దీంతో ఉద్యోగుల వైఖరిపై రోగుల బంధువులు ఫిర్యాదు చేశారు. ల్యాబ్ రిపోర్ట్‌లు ఇవ్వకుండా అక్కడ పనిచేసే కొందరు టిక్ టాక్ వీడియోలు చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై స్పందించిన అధికారులు... ల్యాబ్ టెక్నీషియన్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

    టిక్ టాక్ మోజులో సామాన్యజనం మాత్రమే కాదు.. ప్రభుత్వ ఉద్యోగుల సైతం.. వారి వర్క్ ప్లేసెస్‌లో టిక్ టాక్ వీడియోలు చేస్తున్నారు. నిజానికి టిక్ టాక్ చేయటమే తమ ఉద్యోగమనుకునే రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. దీంతో టిక్ టాక్ యాప్‌లో మునిగి ఉద్యోగాల మీదికి తెచ్చుకుంటున్నారు కొందరు. ఖమ్మం కార్పొరేషన్ ఉద్యోగులతో మొదలైన టిక్ టాక్ వ్యవహారం .. తాజాగా కదిరి ప్రభుత్వాసుపత్రి వరకు చేరింది. ఆయా ఘటనలపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకున్నా మిగతా వారిలో మార్పు రావడం లేదు.
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Anantapuram, Andhra Pradesh, Tik tok, Tiktok

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు