కోడెలకు మళ్లీ షాక్... కుమారుడిపై మరో కేసు

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు

కోడెల కుమారుడు శివారంపై గతంలో కూడా అనేక కేసులు నమోదు చేశారు పోలీసులు. 2014లో కోడెల గెలుపుతో కుమారుడు శివరామకృష్ణ అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

  • Share this:
    టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు మరో షాక్ తగిలింది. ఆయన తనయుడు డాక్టర్ శివరామకృష్ణపై మరో కేసు నమోదైంది. నరసరావుపేటకు చెందిన ఎమ్మార్పీఎస్ నాయకుడు కాల్వ రవి ఫిర్యాదు శివరామకృష్ణపై ఫిర్యాదు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని తన వద్ద డబ్బులు తీసుకొని మోసం చేశాడని ఆరోపించారు. ఈ మేరకు శివరామకృష్ణతోపాటు ఆయన కార్యదర్శి ప్రసాదుపై మోసం, కుల దూషణ, బెదిరింపు నేరాల కింద కేసులు నమోదు చేసినట్టు టూ టౌన్ పోలీసులు తెలిపారు.

    పట్టణానికి చెందిన మద్దూరి నాగరాజు అనే వ్యక్తికి జిల్లా పరిషత్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని శివరామకృష్ణ ఐదు లక్షలు, ఆయన కార్యదర్శి ప్రసాదు రెండు లక్షల రూపాయలు తీసుకున్నట్టు పోలీసులకు రవి ఫిర్యాదు చేశాడు. అయితే, ఉద్యోగం ఇప్పించడంలో విఫలమైనందున డబ్బులు వెనక్కి ఇవ్వమన్నా ఇవ్వలేదని ఆరోపించారు. అంతేకాక, కులం పేరుతో తనను దూషించారని, బెదిరించారన్నారు రవి.

    కోడెల కుమారుడు శివారంపై గతంలో కూడా అనేక కేసులు నమోదు చేశారు పోలీసులు. 2014లో కోడెల గెలుపుతో కుమారుడు శివరామకృష్ణ అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అతడు ప్రజలు పట్టి పీడించాడని విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా జీఎస్టీ బదులు కేఎస్టీ కూడా వసూలు చేస్తున్నారని శివరామకృష్ణపై ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే పలు కంపెనీలు ఆయన పై ఫిర్యాదు చేశాయి. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు ఆదివారం రాత్రి నుండి కోడెల శివరాంకి సంబంధించిన కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌, గుంటూరులోని ఆయనకు సంబంధించిన పలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.
    First published: