• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • ANOTHER CASE HAS BEEN REGISTERED ON EX MLA JC RABHAKAR REDDY ANATHAPUR DISTIRCT NGS

JC Prabhakar Reddy: జేసీ ఇంట్లో పోలీసుల సోదాలు.. స్పర్శ అని రాసి ఉన్న బ్యాగ్ ఓపెన్ చేసి అవాక్కు

JC Prabhakar Reddy: జేసీ ఇంట్లో పోలీసుల సోదాలు.. స్పర్శ అని రాసి ఉన్న బ్యాగ్ ఓపెన్ చేసి అవాక్కు

జేసీ ప్రభాకర్ రెడ్డి(ఫైల్ ఫోటో)

జేసీ బ్రదర్స్ ను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. ఒక కేసులో అరెస్ట్ అయ్యి.. బెయిల్ పై బయటకు వస్తే మరో కేసు నమోదవుతోంది. ఇలా వరుస కేసులతో జేసీ బ్రదర్స్ ఊపిరి తీసుకోలేకపోతున్నారు. అయితే రాజకీయంగా అధికార పార్టీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని జేసీ బ్రదర్స్ మండిపడుతున్నారు.

  • Share this:
    జేసీ బ్రదర్స్.. ఈ ద్వయం ఏం చేసినా సంచలనమే అవుతోంది. అనంతపురం జిల్లాలో కొన్ని దశాబ్దాలుగా జేసీ బ్రదర్స్ ఆడింది ఆట పాడింది పాట..  వారు ఎంత చెబితే అంత. ఎదిరించే వారే ఎప్పుడూ కనిపించలేదు.  కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జేసీ బ్రదర్స్ ను కేసులపై కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. జగన్ సీఎం అయిన తరువాత అత్యధిక కేసులు నమోదైన రాజకీయ నేతలుగా ముద్ర వేసుకున్నది కూడా వీరే.. ఒక కేసుపై అరెస్ట్ అయ్యి.. ఏదో ఒకలా బెయిల్ పై బయటకు వస్తే మరో కేసు నమోదు అవుతూ వస్తోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై మరోకేసు నమోదైంది.

    అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై మరో ఊహించని కేసు నమోదైంది. త్వరలో మున్సిపల్ ఎన్నికలు ఉండడంతో కోడ్ ఉల్లఘిస్తూ..  ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారన్న ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల కిందట బృందావనం అపార్ట్‌మెంట్‌లోని గౌరీనాథ్ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆ సోదాలు చేసిన పోలీసులు  అవాక్కు అయ్యారు. వాటిని స్వాధీనం చేసుకుని విచారణ జరిపిన పోలీసులు.. ఇవాళ కేసు  నమోదు చేశారు.

    ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి కొన్ని క్రికెట్ కిట్లను తెప్పించినట్టు పోలీసులు గుర్తించారు. అతకుముందు  పోలీసులు జరిపిని ఈ సోదాల్లో స్పర్శ అని ముద్రించిన బ్యాగ్ లు దొరికినట్టు తెలుస్తోంది. అయితే ఆ బ్యాగుల్లో క్రికెట్‌ కిట్లు చూపి పోలీసులకు షాక్ కు గురయ్యారు. అక్కడ దొరికిన మొత్తం 130 కిట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కిట్లు అన్నింటినీ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో యువతకు పంచి ప్రలోభాలకు గురిచేస్తారనే ఆరోపణలతో జేసీ ప్రభాకర్‌రెడ్డి పై ఐసీపీ సెక్షన్ 188, 171 ఈ కింద కేసు నమోదు చేశారు.

    ఈ కేసులపై జేసీ వర్గీయులు మండిపడుతున్నారు. సంబంధం లేని కేసుల్లో తమను ఇరికిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. కేవలం రాజకీయ కక్ష్య సాధింపు చర్యలో భాగంగానే ఇలా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని జేసీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో తమ వారిని నామినేషన్ వేయకుండా అధికార పార్టీ నేతలు దౌర్జన్యం చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. అయితే  వేదింపులకు పాల్పడుతున్నారని తమ ప్రత్యర్థులపై కేసులు పెడితే పోలీసులు అస్సలు పట్టించుకోవడం లేదని.. కానీ తమను మాత్రం ఇలా అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారని జేసీ బ్రదర్స్ మండిపడుతున్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు