Dalit Attacks in AP | ‘జగన్ పాలనలో దళితులకు జీవించే హక్కు లేదా?’

దళితులపై వరుస దాడుల నేపథ్యంలో వైసీపీపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ పాలనలో దళితులకు జీవించే హక్కు లేదా? అని ప్రశ్నించారు.

news18-telugu
Updated: August 5, 2020, 1:16 PM IST
Dalit Attacks in AP | ‘జగన్ పాలనలో దళితులకు జీవించే హక్కు లేదా?’
మరో దళితుడిపై దాడి ఘటన
  • Share this:
దళితులపై రాష్ట్రంలో జరుగుతున్న వరుస దాడి ఘటనపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. జగన్ పాలనలో దళితులకు జీవించే హక్కు లేదా? అని ఆయన ప్రశ్నించారు. మాస్కు పెట్టుకోలేదని దళిత యువకుడు కిరణ్ ని కొట్టి చంపారని...అక్రమ ఇసుక రవాణాకి అడ్డుపడ్డాడని వరప్రసాద్‌కి శిరోముండనం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఇళ్ల పట్టా అడిగినందుకు శ్రీకాకుళం జిల్లా పలాస టెక్కలిపట్నం గ్రామస్తుడు మర్రి జగన్‌ పై వైసీపీ నాయకులు దాడి చేశారన్నారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన మర్రి జగన్‌ను నడి రోడ్డుపై తల్లి ముందే స్థానిక సీఐ బూటుకాలితో తన్ని చితకబాదాడని మండిపడ్డారు.వైసీపీ నాయకుల్లాకే ప్రజలను హింసిస్తున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వైసీపీని టార్గెట్ చేస్తూ నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు.



సీఐ వేణుగోపాల్‌పై  సస్పెన్షన్ వేటు...

ఇలా ఉండగా ఈ ఘటనపై ఏపీ డీజీపి సీరియస్ అయ్యారు. దళిత యువకుడిపై దురుసుగా ప్రవర్తించిన సీఐ వేణుగోపాల్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు విచారణకు ఆదేశిస్తున్నట్లు చెప్పారు. పోలీసు యంత్రాంగంలో ఇలాంటి ప్రవర్తనను సహించేది లేదని ఏపీ డీజీపి తన ప్రకటనలో స్పష్టంచేశారు.


శ్రీకాకుళం ఘటనకు మంత్రి ధర్మాన ఖండన
శ్రీకాకుళం జిల్లాలో దళితుడిపై జరిగిన దాడి ఘటనను ఏపీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ ఖండించారు. పలాస పోలీస్ స్టేషన్ ఎదుట దళితునిపై సీఐ దాడికి దిగడం బాధాకరమన్నారు. బాధ్యుడైన సీఐ వేణుగోపాల్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని తగిన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, ప్రాథమిక నివేదిక అందజేయాలని విశాఖ రేంజ్ డీఐజీ, శ్రీకాకుళం ఎస్పీలకు తగిన ఆదేశాలు ఇచ్చామన్నారు. దళితుల రక్షణకు ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది అని మంత్రి ధర్మాన తెలిపారు.
Published by: Janardhan V
First published: August 5, 2020, 11:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading