వైసీపీకి షాక్.. గుర్తింపు రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్...

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

news18-telugu
Updated: July 10, 2020, 7:52 PM IST
వైసీపీకి షాక్.. గుర్తింపు రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్...
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం
  • Share this:
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అన్నా వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఈ పిటిషన్ దాఖలు చేశారు. 13న ఈ పిటిషన్ మీద విచారణ జరగనుంది. ఇటీవల ఎన్నికల సంఘానికి కూడా అన్నా వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్ భాష, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ ఫిర్యాదు చేశారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి బదులు వైఎస్ఆర్ పేరును ఉపయోగించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వారు వినతి పత్రం అందించారు. అయితే ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తాము న్యాయ పోరాటానికి సిద్ధమయ్యామని మహబూబ్ బాషా తెలిపారు. అధికార బలం, డబ్బు బలం తో ఏపీ లోని జగన్ పార్టీ నాయకులు దౌర్జన్యం గా తమ పార్టీ పేరును వాడుకుంటున్నారని ఆరోపించారు. దీంతో నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిన తమ పార్టీ నాయకులు కార్యకర్తలు అయోమయానికి గురి అవుతున్నారని మహబూబ్ బాషా ఆందోళన వ్యక్తం చేశారు.

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా గతంలో ఈ పేరుపై అభ్యంతరాలు తెలిపారు. పార్టీ తరఫున షోకాజ్ నోటీస్ పంపిన జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని ఘాటుగా విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ నోటీస్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 10, 2020, 7:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading