మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల ఇంటి ఎదుట మహిళల ధర్నా..

‘రావాలి ఆర్కే.. సమాధానం చెప్పాలి ఆర్కే.’ అంటూ నినాదాలు చేశారు. యానిమేటర్లను తొలగిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: November 10, 2019, 7:46 PM IST
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల ఇంటి ఎదుట మహిళల ధర్నా..
ఎమ్మెల్యే ఇంటి ఎదుట ధర్నా చేస్తున్న యానిమేటర్లు
news18-telugu
Updated: November 10, 2019, 7:46 PM IST
మంగళగిరి ఎమ్యెల్యే ఆళ్ళరామకృష్ణారెడ్డి ఇంటి ఎదుట యానిమేటర్లు ధర్నా నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని 27వేల మంది యానిమేటర్లను ప్రభుత్వం తొలగించింది. దీనిపై వారు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో యానిమేటర్లు వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంటి ఎదుట నిరసనకు దిగారు. సుమారు 30 మంది వరకు యానిమేటర్లు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంటి ఎదుట బైఠాయించారు. ‘రావాలి ఆర్కే.. సమాధానం చెప్పాలి ఆర్కే.’ అంటూ నినాదాలు చేశారు. లక్షలాది ఉద్యోగాలు కల్పించామని చెబుతున్న ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యానిమేటర్లను తొలగిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

స్వయం సహాయక సంఘాలకు చెందిన యానిమేటర్లను తొలగించడంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ మండిపడ్డారు. ‘ఎన్నికల ముందు మంగళగిరిలో 'లోకేష్ గెలిస్తే మీ ఇళ్లు తొలగిస్తాడు' అని అసత్య ప్రచారం చేసిన నాయకుడు.. ఇప్పుడు మంగళగిరిలో జీవితాలే లేకుండా చేస్తున్నారు. మంగళగిరిలో వెలుగు యానిమేటర్లు పగలు, రాత్రి అని లేకుండా పోరాటం చేస్తున్నా పట్టించుకోవడం లేదు.’ అంటూ మహిళలు నిరసన తెలుపుతున్న వీడియోను ట్వీట్ చేశారు.

2019 ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి టీడీపీ తరఫున నారా లోకేష్ పోటీ చేశారు. వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో దిగారు. అయితే, లోకేష్ మీద ఆళ్ల రామకృష్ణరెడ్డి 5వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
First published: November 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...