Home /News /politics /

ANIL BURAGADDA FILES A PETITION IN KODELA DEATH DEMAND FOR CBI ENQUIRY BA

కోడెల ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. తెరపైకి కొత్త వాదన

డాక్టరుగా పలనాటి ముద్దుబిడ్డ అయ్యారని గుర్తు చేశారు. రాజకీయ నేతగా పల్నాటి పులి అనిపించుకున్నారని చంద్రబాబు అన్నారు.అటువంటి నేత ఈరోజు మనమధ్య లేకపోవడం రాష్ట్ర రాజకీయాలకే తీరనిలోటు అని వ్యాఖ్యానించారు.

డాక్టరుగా పలనాటి ముద్దుబిడ్డ అయ్యారని గుర్తు చేశారు. రాజకీయ నేతగా పల్నాటి పులి అనిపించుకున్నారని చంద్రబాబు అన్నారు.అటువంటి నేత ఈరోజు మనమధ్య లేకపోవడం రాష్ట్ర రాజకీయాలకే తీరనిలోటు అని వ్యాఖ్యానించారు.

కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోలేదని, ఆయనది హత్య అంటూ అనిల్ బూరగడ్డ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోలేదని, ఆయనది హత్య అంటూ అనిల్ బూరగడ్డ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోడెల మరణంపై సీబీఐ విచారణ జరపాలని అనిల్ బూరగడ్డ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో కోరారు. కోడెల శివప్రసాద్‌ను ఆయన కుమారుడు కోడెల శివరామకృష్ణ హత్య చేసి ఉంటారని అనిల్ ఆరోపించారు. ఇటీవల కోడెల కుటుంబంపై వరుసగా కేసులు నమోదు కావడంతో వాటి నుంచి తప్పించుకునేందుకు తండ్రిని హత్య చేసి ఉంటారని అనిల్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌లో సీబీఐ, తెలంగాణ ప్రభుత్వం, బంజారాహిల్స్ సీఐలను ప్రతివాదులుగా చేర్చారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Chandrababu naidu, Kodela death, Tdp, Telangana High Court, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు