ఆరు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీపీఐ

రాబోయే ఎన్నికల్లో జనసేన, బీఎస్పీ, వామపక్షాలు కూటమిగా బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా బీఎస్పీకి 21 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలు కేటాయించారు. సీపీఐ, సీపీఎంలకు ఏడేసి చొప్పున శాసనసభ, రెండేసి లోక్‌సభ స్థానాలు కేటాయించారు.

news18-telugu
Updated: March 18, 2019, 8:22 PM IST
ఆరు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీపీఐ
సీపీఐ పార్టీ నేతలతో రామకృష్ణ(File)
news18-telugu
Updated: March 18, 2019, 8:22 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సీపీఐ తమ అభ్యర్థులను ప్రకటించింది. జనసేనతో పొత్తులో భాగంగా 7 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తున్న సీపీఐ.. మిగతా స్థానాలకు మంగళవారం అభ్యర్థులను ప్రకటించనుంది. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర  కార్యదర్శి రామకృష్ణ మీడియాకు వివరాలు వెల్లడించారు.

సీపీఐ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా

ఎస్‌.కోట - పి. కామేశ్వరరావు

పాలకొండ (ఎస్టీ) - డీవీజీ శంకరరావువిశాఖ పశ్చిమ - జేవీ సత్యనారాయణమూర్తి
మంగళగిరి - ముప్పాళ్ల నాగేశ్వరరావు

డోన్‌ - కె.రామాంజనేయులు
కనిగిరి - ఎం.ఎల్‌.నారాయణ

కాగా, రాబోయే ఎన్నికల్లో జనసేన, బీఎస్పీ, వామపక్షాలు కూటమిగా బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా బీఎస్పీకి 21 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలు కేటాయించారు. సీపీఐ, సీపీఎంలకు ఏడేసి చొప్పున శాసనసభ, రెండేసి లోక్‌సభ స్థానాలు కేటాయించారు.ఇదిలా ఉంటే, ఎన్నికల నామినేషన్లు సోమవారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నెల 25వరకు నామినేషన్ల పర్వం కొనసాగనుంది. మార్చి 26న నామినేషన్ల పరిశీలన.. 27-28 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది.
First published: March 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...