జగన్ తాత రాజారెడ్డి వాళ్లను బతకనివ్వలేదు.. అలాంటి కుటుంబాన్ని నమ్ముతారా?: యనమల

ఏలూరులో వైసీపీ చేపట్టిన బీసీ గర్జనపై మంత్రి యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం అధికార కాంక్షతోనే జగన్ ఇప్పుడు బీసీల జపం చేస్తున్నారని యనమల విమర్శించారు. బీసీలు జగన్ కొంగజపాన్ని నమ్మరని అన్నారు.

news18-telugu
Updated: February 17, 2019, 5:48 PM IST
జగన్ తాత రాజారెడ్డి వాళ్లను బతకనివ్వలేదు.. అలాంటి కుటుంబాన్ని నమ్ముతారా?: యనమల
వైఎస్ జగన్, యనమల రామకృష్ణుడు..
news18-telugu
Updated: February 17, 2019, 5:48 PM IST
వైసీపీ బీసీ గర్జనపై ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బీసీలను అణచివేసిందే జగన్ కుటుంబం అని ఆరోపించారు. పేదలైన బీసీలను జగన్ తాత రాజారెడ్డి ఫాక్షన్‌కు బలిచేశారని, వారు నిలదొక్కుకుంటే ఎక్కడ తిరగబడుతారోనన్న భయంతోనే ఫాక్షన్ కేసుల్లో వారిని జైళ్లకు పంపించారని ఆరోపించారు. బీసీ సమస్యలపై జగన్ ఏనాడు మాట్లాడలేదని, తండ్రి అధికారంలో ఉన్నప్పుడు కూడా వారి గురించి మాట్లాడింది లేదని అన్నారు.

జగన్ తాత రాజారెడ్డి.. బీసీలను బతకనివ్వలేదు. జగన్ తండ్రి బీసీలను జైళ్లలో పెట్టించాడు. ఆ కుటుంబం బీసీలను ఫాక్షనిజానికి బలిచేసింది. బీసీలపై వారు అకృత్యాలకు పాల్పడ్డారు. వారి ఆస్తులు, తోటలు, పంటలు నాశనం చేశారు. కడప అభివృద్ధి చెందక పోవడానికి కారణం రాజారెడ్డి కుటుంబమే.
మంత్రి యనమల రామకృష్ణుడు


కేవలం అధికార కాంక్షతోనే జగన్ ఇప్పుడు బీసీల జపం చేస్తున్నారని యనమల విమర్శించారు. బీసీలు జగన్ కొంగజపాన్ని నమ్మరని అన్నారు. ఎంతసేపూ తన ఆస్తులు పెంచుకోవాలన్న శ్రద్ధనే తప్పించి బీసీలకు ఆర్థికంగా మేలు చేయాలన్న శ్రద్ద జగన్‌కు లేదని విమర్శించారు. బీసీలు ఫాక్షన్ కుటుంబాన్ని నమ్మరని.. ఫాక్షన్ రాజకీయం చేసేవాళ్లు బీసీలకు ఏం న్యాయం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చూడండి:First published: February 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...