• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • ANDHRAPRADESH ODISHA BORDER KOTIA DISPUTE CONTINUE NGS

AP Panchayat Elctions:కొటియాలో మూడు గ్రామాలు ఏపీవే.. విచారణ వాయిదా

AP Panchayat Elctions:కొటియాలో మూడు గ్రామాలు ఏపీవే.. విచారణ వాయిదా

సుప్రీంకోర్టు (ఫైల్ ఫొటో)

ఆంధ్రా ఒడిశా మధ్య పంచాయతీ కొనసాగుతూనే ఉంది. కొటియా గ్రామాలు మావంటే మావని రెండు రాష్ట్రాలు వాధిస్తున్నాయి.. మొన్న సమాధానం కోసం ఆంధ్ర ప్రదేశ్ కు సుప్రీం మూడు వారాలు గడువు ఇస్తే.. ఇప్పుడు ఒడిశా ప్రభుత్వం నాలుగు వారాలు టైం తీసుకుంది. దీంతో తీర్పు ఎలా ఉంటుంది అన్నదానిపై ఆసక్తి పెరిగింది.

  • Share this:
    ఏపీ-ఒడిశా ప్రభుత్వాల మధ్య కొటియా వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ కొనసాగింది. తమ భూ భాగంలోని 3 గ్రామ పంచాయతీల పేర్లు మార్చి ఏపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోందని గతంలో ఒడిశా ప్రభుత్వం పిటిషన్‌ వేసింది.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ భూభాగంలోని మూడు గ్రామ పంచాయతీల పేర్లను మార్చి ఎన్నికలను నిర్వహిస్తోందని ఆరోపిస్తూ  పిటిషన్ లో పేర్కొంది. ఒడిశా అభ్యంతరాలపై వచ్చే వారం లోపు సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఏపీ ప్రభుత్వం తరఫున విజయనగరం జిల్లా కలెక్టర్‌ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. కోటియా పరిధిలోని 3 గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో భాగమేనని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

    ఏపీ ప్రభుత్వం గతంలోనూ అక్కడ పంచాయతీ ఎన్నికలు నిర్వహించినట్టు అఫిడవిట్ లో పేర్కొన్నారు. అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి మూడు గ్రామాలు వస్తాయని స్పష్టం చేశారు. ఒడిశా పిటిషన్‌ కొట్టివేయాలని విజయనగరం కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సమాధానం ఇచ్చేందుకు ఒడిశా ప్రభుత్వం నాలుగువారాల గడువు కోరింది. దీంతో ఈకేసు తదుపరి విచారణను జస్టిస్‌ ఖన్‌ విల్కర్‌ ధర్మాసనం నాలుగు వారాలకు వాయిదా వేసింది.

    ప్రభుత్వాల వాదన ఎలా ఉన్నా.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉన్న 34 గ్రామాలకు చెందిన దాదాపు 4 వేల మంది ఓటర్లు అధికారికంగా రెండేసి ఓట్లు వేస్తారు. అది ఒక రాష్ట్రంలో కాదు.. రెండు రాష్ట్రాల్లో. అలా ఓట్లు వేయడం కోసమే ఆంధ్రప్రదేశ్, ఒడిశా రెండూ రాష్ట్రాలు వీరికి పోటీ పడి ఓటు హక్కుతో పాటు అనేక పథకాలు అందిస్తున్నాయి రెండు ప్రభుత్వాలు.  దీంతో అక్కడ గిరిజనులకు రెండు రేషన్ కార్డులు, రెండు పింఛన్ కార్డులు, రెండు ఓటరు కార్డులు...ఇలా అన్నీ రెండేసి ఉంటాయి. అలాగే రెండు రాష్ట్రాల ప్రజాప్రతినిధులను వీరు ఎన్నుకునే అవకాశం ఉంది.

    ఈ గ్రామాల కోసం ఏపీ ఒడిశా మద్య ఎప్పటినుంచో వివాదం అలాగే ఉన్నా.. ప్రభుత్వాలు పరిష్కరానికి ప్రయత్నాలు చేయలేదు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలతో మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. ఆ వివాదం ఇప్పుడు కోర్టు దాకా వెళ్లింది. మరి నాలుగు వారాల తరువాత సుప్రీం ఏం చెబుతుందో చూడాలి..

    కొటియాలో ఉన్న కొందరు గ్రామస్థులు మాత్రం తాము ఎన్నికల్లో పాల్గొంటే ఏపీ ప్రభుత్వం పథకాలు  వస్తాయి కధా అని నిలదీస్తున్నారు.. రెండు రాష్ట్రా ప్రభుత్వాలు రెండు పథకాలు ఇస్తే ఎందుకు వద్దాంటాం అంటున్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు