AP Election 2019 HIghlights : ఏపీ ఎన్నికల్లో హింస, టీడీపీ - వైసీపీ కొట్లాట.. ఇద్దరు మృతి

ఏపీలో నేటి ఉదయం ప్రశాంత వాతావరణంలో మొదలైన ఎన్నికలు హింసాత్మక వాతావరణంలో ముగిశాయి. ప్రధానంగా రాయలసీమ జిల్లాలు, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ప్రధాన పార్టీల అనుచరులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. కొన్నిచోట్ల రిగ్గింగ్ చేసినట్టుగా ఆరోపణలు కూడా వచ్చాయి. అధికార పార్టీ టీడీపీ పోలింగ్ ఆలస్యమవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అంతేకాదు, టీడీపీకి ఓటు వేస్తే వైసీపీకి పడుతోందని ఆరోపించింది. టీడీపీ ఆరోపణలకు వైసీపీ కూడా కౌంటర్ ఇచ్చింది. మొత్తం మీద పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త వాతావరణంలోనే ఓటింగ్‌కు తెరపడింది. ఈ నేపథ్యంలో నేటి ఎన్నికల HIGHLIGHTS మీకోసం

news18-telugu
Updated: April 11, 2019, 7:01 PM IST
AP Election 2019 HIghlights : ఏపీ ఎన్నికల్లో హింస, టీడీపీ - వైసీపీ కొట్లాట.. ఇద్దరు మృతి
ఏపీలో ఎన్నికల చిత్రాలు..
news18-telugu
Updated: April 11, 2019, 7:01 PM IST
తాడిపత్రిలో హైటెన్షన్ ఇద్దరు మృతి..
అనంతపురం జిల్లా... తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మీరాపురంలో వైసీపీ - టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన టీడీపీ కార్యకర్త సిద్ధా భాస్కరరెడ్డి చనిపోయారు. అలాగే వైసీపీకి చెందిన కార్యకర్త పుల్లారెడ్డి కూడా మృతి చెందారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హింసాత్మకంగా ఏపీ ఎన్నికలు... : ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈవీఎంలు మొరాయించడంతో చాలా చోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమవ్వగా, మరికొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. టీడీపీ, వైసీపీ నేతల మధ్య జరిగిన ఘర్షణలు ఇద్దరి ప్రాణాలు తీశాయి. పోలింగ్‌కు ఇబ్బందులు కలిగించాయి. ఇక శ్రీకాకుళం జిల్లాలోని రాజాం ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అధికారి గిరిబాబు ముసలివాళ్ల ఓట్లను స్వయంగా వేస్తున్నారు. దీనిపై టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైసీపీ రాళ్ల దాడి..: సత్తెనపల్లి నియోజకవర్గంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై దాడి జరిగింది. నియోజకవర్గంలోని రాజపాలెంలోని ఇనిమెట్ల గ్రామంలో సభాపతి మీద వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. రాళ్ల దాడి చేయడంతో స్పీకర్ కోడెల తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండిపవన్ కళ్యాణ్ ఫసక్ : లోకేష్ బాటలో నోరు జారి.. ఎలక్షన్ ప్రచారం సందర్భంగా గత కొన్ని రోజులుగా ఏపీ ఐటీ మంత్రి లోకేష్ పలు సందర్భాల్లో నోరు జారి నవ్వుల పాలైన సంగతి తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైసీపీ, జనసేన,బీజేపీకి చెందిన పార్టీ శ్రేణులతో పాటు సామాన్య జనాలు పెద్ద ఎత్తున ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా జనసేనాని కూడా లోకేష్ బాటలో చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నాయి. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏపీలో ప్రశాంతంగా ఎన్నికలు : ద్వివేది
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది. ఉదయం 11 గంటల సమయానికి 15 శాతం పోలింగ్ నమోదైందన్నారు. 12 ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు తప్పితే... అంతా ప్రశాంతంగా ఉందన్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పవన్ కళ్యాణ్ పైనుంచీ దిగొచ్చాడా...? : జనసేన అధినేత పవన్ కళ్యాణ్... ఓటు వేసేందుకు వచ్చినప్పుడు రూల్స్ పాటించలేదంటూ మండిపడుతున్నారు కొందరు ఓటర్లు. విజయవాడలో ఓటు వేసేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ క్యూ పద్ధతి పాటించకుండా... తిన్నగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లిపోయారనీ, ఓటర్లను తోసుకుంటూ ముందుకు వెళ్లిపోవడం సమంజసం కాదనీ తోటి ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం అభ్యర్థిగా చెప్పుకునే పవన్ కళ్యాణ్ కనీస మర్యాదలూ, రూల్సూ పాటించకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

EVMలు ఎందుకు పనిచెయ్యట్లేదు... :
ఓవైపు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయనీ, ఈవీఎంలు కూడా బాగానే పనిచేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదీ అంటుంటే... రాజకీయ పార్టీలు మాత్రం... ఈవీఎంలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. ఏపీ వ్యాప్తంగా మొత్తం 362 ఈవీఎంలు మొరాయించాయి. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రీపోలింగ్‌కు చంద్రబాబు డిమాండ్
ఆంధ్రప్రదేశ్‌లో రీ పోలింగ్ నిర్వహించాలని ఏపీ సీఎం చంద్బరాబునాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జీకే ద్వివేదీకి చంద్రబాబునాయుడు లేఖ రాశారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ మీద ఓటర్లకు అభ్యంతరాలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. టీడీపీకి ఓటు వేస్తే అది వైసీపీకి వెళ్తోందని ఫిర్యాదులు వస్తున్నాయిని, దీనిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

MY VOTE APP : మై ఓట్ యాప్‌కి ఏమైంది... పోలింగ్ రోజున ఫసక్....
ఏపీలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో క్యూలో ఎంతమంది ఉన్నారో తెలుసుకునేందుకు ఈసీ ప్రారంభించిన మై వోట్ యాప్ పనిచేయకుండా పోయింది. మై ఓట్ యాప్ వాడకంపై విస్తృత ప్రచారం కల్పించిన ఈసీ... పోలింగ్ రోజున మాత్రం చేతులెత్తేసింది. దీంతో యాప్ డౌన్ లోడ్ చేసుకున్న ఓటర్లు నిరాశకు లోనయ్యారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీ ఈసీ ప్రధాన అధికారికి చేదు అనుభవం...
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చాలా చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. స్వయంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికే ఆ చేదు అనుభవం ఎదురైంది. గుంటూరు జిల్లా తాడేపల్లి 35వ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు ఆయన వెళ్లిన సమయంలో... ఈవీఎం మొరాయించింది. ఈ పరిణామంపై.. ద్వివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
First published: April 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...