ANDHRAPRADESH ELECTIONS 2019 79 64 POLLING TURN OUT IN STATE MS
ఏపీలో పోలింగ్ శాతం ఎంత? ఏ జిల్లాలో ఎక్కువ పోలింగ్ నమోదైంది..?
ప్రతీకాత్మక చిత్రం
ష్ట్రవ్యాప్తంగా మొత్తం 39345717 మంది ఓటర్లు ఉండగా.. 31333631 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయనగరంలో మొత్తం 2175716మంది ఓటర్లు ఉండగా.. 1634399 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 79.64% పోలింగ్ నమోదైనట్టు ఈసీ వెల్లడించింది. 2014తో పోల్చితే ఈసారి 1.64% ఓటింగ్ పెరిగింది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 80.68% పోలింగ్, అత్యల్పంగా విశాఖపట్నంలో 71.81% పోలింగ్ నమోదైనట్టు తెలిపింది. విజయనగరంలో మొత్తం 2175716మంది ఓటర్లు ఉండగా.. 1634399 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. విశాఖపట్నంలో 3578458 మంది ఓటర్లు ఉండగా.. 2545336 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 39345717 మంది ఓటర్లు ఉండగా.. 31333631 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇక పోలింగ్ సరళిని పరిశీలిస్తే.. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మందకొడిగా సాగిన పోలింగ్ ఆ తర్వాత పుంజుకుంది. మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల మధ్యలో అన్ని జిల్లాల్లో భారీ పోలింగ్ నమోదైంది.
మొదట ఈవీఎంలు మొరాయించడం, కొన్నిచోట్ల హింసాత్మక ఘటనలతో పోలింగ్ బూత్ల నుంచి వెనుదిరిగిన ప్రజలు.. మధ్యాహ్నం తిరిగి పోలింగ్ బూత్ల వద్దకు రావడంతో భారీ క్యూ లైన్లు కనిపించాయి. సాయంత్రం 6గంటల వరకు క్యూ లైన్లో నిలబడ్డ ప్రతీ ఒక్కరికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో పలుచోట్ల అర్థరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. సాయంత్రం సమయంలో ఓటేసినవారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్టు చెబుతున్నారు. మొత్తం మీద గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరిగిందనేది స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఈ పెరిగిన పోలింగ్ ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిబింబించబోతుందా.. లేక ప్రభుత్వ పథకాలు నచ్చి ఎక్కువ మంది ఓటు వేశారా? అన్నది తెలియాలంటే మే 23వ తేదీ వరకు ఆగాల్సిందే.
(ఏపీలో నమోదైన పోలింగ్ వివరాలు..)
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.