జగన్ సర్కార్ కీలక నిర్ణయం..? మందు బాబులకు గట్టి షాక్..

సాధారణంగా సాయంత్రం 6గం. తర్వాతే మద్యం అమ్మకాల జోరు పెరుగుతుంది. పనులు ముగించుకుని ఇళ్లకు బయలుదేరే చాలామంది.. మార్గమధ్యలో మద్యం పుచ్చుకుని వెళ్తుంటారు.మద్యం షాప్ టైమింగ్స్‌ను కుదిస్తే ఇక దానికి బ్రేక్ పడ్డట్టే.

news18-telugu
Updated: July 9, 2019, 12:36 PM IST
జగన్ సర్కార్ కీలక నిర్ణయం..? మందు బాబులకు గట్టి షాక్..
వైఎస్ జగన్ (File)
  • Share this:
ఎన్నికల సందర్భంలో వైసీపీ ఇచ్చిన హామీల్లో మద్యపాన నిషేధం ఒకటి. చెప్పినట్టుగానే విడతలవారీగా ఆ దిశగా అడుగులు వేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. మద్యం అమ్మకాలపై నియంత్రణ తీసుకురావాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా మద్యం షాప్ టైమింగ్స్‌ను కుదించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉదయం 10గంటల నుంచి రాత్రి 10గంటల వరకు మద్యం షాప్స్ కొనసాగుతున్నాయి. అలా కాకుండా ఉదయం 10గం. నుంచి సాయంత్రం 6గం. వరకు మాత్రమే మద్యం దుకాణాలను తెరిచి ఉంచాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.

ఇదే జరిగితే మద్యపాన నిషేధం దిశగా బలమైన అడుగుపడ్డట్టే. సాధారణంగా సాయంత్రం 6గం. తర్వాతే మద్యం అమ్మకాల జోరు పెరుగుతుంది. పనులు ముగించుకుని ఇళ్లకు బయలుదేరే చాలామంది.. మార్గమధ్యలో మద్యం పుచ్చుకుని వెళ్తుంటారు.మద్యం షాప్ టైమింగ్స్‌ను కుదిస్తే ఇక దానికి బ్రేక్ పడ్డట్టే. అక్టోబర్ నుంచి ఈ కొత్త పాలసీని అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించినట్టు తెలుస్తోంది. మరికొన్ని ప్రతిపాదనలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం.మొత్తం మీద జగన్ ప్రభుత్వం ఈ పాలసీని గనుక అమలు చేస్తే మందుబాబుల నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టే.

First published: July 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>