చంద్రబాబు, లోకేష్‌పై... AU వీసీ సంచలన ఆరోపణలు

లోకేశ్, ఆయన తండ్రి చంద్రబాబు కారణంగానే విద్యార్థులకు రోడ్ల మీదకు రావాల్సి వచ్చిందన్నారు ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి.

news18-telugu
Updated: February 2, 2020, 8:52 AM IST
చంద్రబాబు, లోకేష్‌పై... AU వీసీ సంచలన ఆరోపణలు
ఆంధ్రా యూనివర్శిటీ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనపై స్పందించాడు విసి ప్రసాద్ రెడ్డి. విద్యార్థుల ఆందోళనకు నారా లోకేష్ మద్దతు తెలపడంపై విసి
ధ్వజమెత్తారు. లోకేశ్, ఆయన తండ్రి చంద్రబాబు కారణంగానే విద్యార్థులకు రోడ్ల మీదకు రావాల్సి వచ్చిందన్నారు. ఎన్నికలకు మూడు నెలల ముందు ఏయూ నిధులను భారీగా దుర్వినియోగం చేశారన్నారు. బ్లాక్ గ్రాంట్స్ ఇవ్వకుండా ఏయూ ఇంటర్నల్ గ్రాంట్స్ ను కూడా అడ్డగోలుగా వాడుకున్నారన్నారు. ఆంధ్రా యూనివర్శిటీ నిధుల నుంచి వందకోట్ల రూపాయలు చంద్రబాబు హయాంలో మళ్లించి పసుపు కుంకుమకు కేటాయించారు. వంద కోట్ల రూపాయల యూనివర్సిటీ నిధులను నియమ, నిబంధనలకు విరుద్ధంగా వాడుకున్నారని ఆరోపణలు చేశారు. జ్ఞానభేరి కోసం రూ. 4 కోట్ల రూపాయలను దారి మళ్లించి ఏయూ నిధులతో ఎన్నికల ప్రచారం నిర్వహించారన్నారు ప్రసాద్ రెడ్డి. క్యాంపస్ లో ప్రస్తుతానికి నడుస్తున్న ఆందోళన వెనుక రాజకీయ పార్టీల హస్తం ఉందన్నారు వీసీ. విద్యార్థులు భవిష్యత్తుతో చెలగాటం ఆడటం సరికాదన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టి ఏయూ ప్రతిష్టను దిగజారుస్తున్నారని వీసి మండిపడ్డారు. మెస్ చార్జీలు, ఫీజుల పెంపుపై తీసుకున్న నిర్ణయం తనది కాదన్నారు.గత వీసీ హయాంలో తీసుకున్నారన్నారు. విద్యార్థులతో చర్చించి సమస్యలు పరిష్కరించదానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
First published: February 2, 2020, 8:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading