కేంద్రం సంచలనం... మండలి రద్దు మార్చిలోనే?

మార్చి 3వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండో దఫా ప్రారంభం కానున్నాయి. ఆ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం శాసనమండలి రద్దు బి ల్లులను పార్లమెంట్ ముందుకు తీసుకురావొచ్చని తెలిసింది.

news18-telugu
Updated: February 16, 2020, 7:20 PM IST
కేంద్రం సంచలనం... మండలి రద్దు మార్చిలోనే?
ప్రధాని మోదీని కలిసిన సీఎం జగన్ (File)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దుకు సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. శాసనమండలిని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానం చేసి పంపింది. ఆ తీర్మానంపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. వచ్చే మార్చిలోనే శాసనమండలి కథ ముగిసిపోతుందని సమాచారం. ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలసి శాసనమండలి రద్దు,మూడు రాజధానులు, దిశ చట్టానికి కేంద్రం ఆమోదం, రాష్ట్ర సమస్యలను వివరించారు. అయితే, వాటిని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చెప్పాలని ప్రధాని మోదీ సూచించడం వల్లే మరోసారి జగన్ ఢిల్లీ వెళ్లారు. రెండు రోజుల క్రితం అమిత్ షాను కలిసిన సీఎం జగన్ సుమారు 40 నిమిషాల పాటు చర్చించారు. ఈ సందర్భంగా శాసనమండలిని రద్దు చేయాలని అమిత్ షాను కోరినట్టు తెలిసింది. అమిత్ షా సూచన మేరకే ఈనెల 15న సీఎం జగన్ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌‌ను కలిశారు. వాస్తవానికి సీఎం జగన్ ఏపీకి తిరుగుప్రయాణం అవ్వాలని భావించినా... చివరి నిమిషంలో కేంద్ర మంత్రి అపాయింట్‌మెంట్ లభించడంతో ఆయన్ను కలిశారు. హైకోర్టు తరలింపు వ్యవహారం న్యాయశాఖ పరిధిలో ఉంటుంది కాబట్టి రవిశంకర్ ప్రసాద్‌‌ను కలసి చర్యలు తీసుకోవాలని కోరారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేస్తామని గతంలో బీజేపీ కూడా హామీ ఇచ్చింది కాబట్టి, ఆ మాటకు కట్టుబడి హైకోర్టు తరలింపునకు అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు.

వైసీపీbjp ycp alliance,jagan amit shah meeting,bjp janasena alliance,jagan modi meeting,ycp joining nda,బీజేపీ వైసీపీ పొత్తు,కేంద్రంలో చేరున్న వైసీపీ,వైసీపికి రెండు కేంద్రమంత్రి పదవులు,బీజేపీ జనసేన పొత్తు,బీజేపీ వైసీపీ పొత్తుపై పవన్ కామెంట్స్,pawan kalyan on bjp ycp alliance,తో పొత్తు... క్లారిటీ ఇచ్చిన బీజేపీ | Bjp leader sunil deodhar clarifies on alliance with janasena and Amaravati ak
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ


ఏపీ శాసనమండలిని రద్దు చేయాలంటూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసి పంపింది. దీంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ తీర్మానాన్ని కేంద్ర కేబినెట్‌లో ఆమోదించాలి. అనంతరం బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలి. పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి సంతకంచేసి నోటిఫికేషన్ జారీ చేయడంతో అప్పుడు శాసనమండలి అధికారికంగా రద్దు అవుతుంది.

కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి


మార్చి 3వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండో దఫా ప్రారంభం కానున్నాయి. ఆ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం శాసనమండలి రద్దు బిల్లులను పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చి వెంటనే మండలిని రద్దు చేయాలని జగన్ కోరగా, అందుకు కేంద్రం కూడా ఓకే చెప్పినట్టు తెలిసింది. మరోవైపు మార్చి 15వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఆ లోపే శాసనమండలిని రద్దు చేసేలా కేంద్రం నుంచి సానుకూల చర్యలు ప్రారంభం అవుతాయని జగన్‌కు ఢిల్లీ పెద్దలు భరోసా ఇచ్చినట్టు వైసీపీలో ప్రచారం జరుగుతోంది.

కరీంనగర్‌లో ఘోరం.. వంతెనపై నుంచి పడిపోతున్న కానిస్టేబుల్

Published by: Ashok Kumar Bonepalli
First published: February 16, 2020, 7:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading