Home /News /politics /

టార్గెట్ లోకేశ్... రంగంలోకి ఇద్దరు వైసీపీ మహిళా నేతలు

టార్గెట్ లోకేశ్... రంగంలోకి ఇద్దరు వైసీపీ మహిళా నేతలు

నారా లోకేశ్ (File)

నారా లోకేశ్ (File)

మంగళగిరి నియోజకవర్గం పరిధిలో 50 వేలకు పైగా పద్మశాలీల ఓట్లు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండూ... ఆ వర్గానికి చెందిన ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

    ఎన్నికల్లో తమ గెలుపు కోసం సామాజికవర్గాల పరంగా ఓట్లను ఆకర్షిస్తుంటాయి రాజకీయ పార్టీలు. కులాల ప్రభావం ఎక్కువగా ఉండే ఏపీలోని అనేక నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీలు ఎక్కువగా వాటి ఆధారంగానే ఓట్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను దెబ్బతీసేందుకు వైసీపీ కూడా ఓ సామాజికవర్గాన్ని ఆకర్షించేందుకు ఎంతగానో ప్రయత్నిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న నారా లోకేశ్... ఇందుకోసం వైసీపీ సిట్టింగ్ స్థానమైన మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు.

    గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవిపై కేవలం 12 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి... మరోసారి వైసీపీ అభ్యర్థిగా రేసులో ఉన్నారు. దీంతో లోకేశ్, ఆళ్ల రామకృష్ణారెడ్డి మధ్య పోటీ హోరాహోరీగా ఉండబోతోందనే టాక్ మొదలైంది. అయితే ఈ నియోజకవర్గంలో పద్మశాలీ సామాజికవర్గం ఓట్లు కీలకం కావడంతో... వారిని ఆకట్టుకోవడానికి టీడీపీ, వైసీపీ ఎంతగానో శ్రమిస్తున్నాయి. మంగళగిరి నియోజకవర్గం పరిధిలో 50 వేలకు పైగా పద్మశాలీల ఓట్లు ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ఓడిపోయిన గంజి చిరంజీవి లోకేశ్ గెలుపు కోసం శ్రమిస్తున్నారు. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన చిరంజీవి... మంగళగిరిలోని పద్మశాలి ఓట్లు లోకేశ్‌కు పడేలా తనవంతు కృషి చేస్తున్నారు.

    అయితే నియోజకవర్గంలోని పద్మశాలి ఓట్లను దక్కించుకోవాలని ప్లాన్ చేసిన వైసీపీ... ఇందుకోసం అదే సామాజికవర్గానికి చెందిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కాండ్రు కమలను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు మహిళా నేతలు ఆర్కే గెలుపు కోసం మంగళగిరిలో మకాం వేసినట్టు సమాచారం. ఆర్కే గెలుపు కోసం కృషి చేయాలని వైఎస్ జగన్ ఆదేశించడంతో... ఈ ఇద్దరు కూడా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మంగళగిరిలో కీలకంగా భావించే పద్మశాలీల ఓట్లు ఎవరికి పడతాయన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.




    First published:

    Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Guntur S01p13, Lok Sabha Election 2019, Mangalagiri, Nara Lokesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు