HOME » NEWS » politics » ANDHRA PRADESH YSRCP MLA RK ROJA SLAMS CHANDRA BABU NAIDU ON FARMERS ISSUES PRN

MLA Roja: అవి భోగి మంటలుకాదు.., కడుపులో మంటలు..! పండగపూట ఫైర్ బ్రాండ్ పంచ్ లు..!

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)చిత్తూరు జిల్లా, నగరి వైఎస్ఆర్సీపీ (YSRCP) ఎమ్మెల్యే ఆర్కే రోజా (MLA RK Roja) మరోసారి తెలుగుదేశం పార్టీ (Telugu Desham party) అధినేత చంద్రబాబు నాయుడి (Nara Chandra Babu Naidu) పై మండిపడ్డారు.

news18-telugu
Updated: January 13, 2021, 2:18 PM IST
MLA Roja: అవి భోగి మంటలుకాదు.., కడుపులో మంటలు..! పండగపూట ఫైర్ బ్రాండ్ పంచ్ లు..!
ఎమ్మెల్యే రోజా (ఫైల్)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా, నగరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మరోసారి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు. పండగ పూట కూడా ప్రతిపక్ష నేతపై తనదైన శైలిలో పంచ్ లు వేశారు. భోగి పండుగ సందర్భంగా తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేసిన రోజా.., చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ప్రజలు భోగి మంటలు వేసుకుంటే.. చంద్రబాబు తన కడుపులో మంటలు వేసుకున్నారంటూ విమర్శించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేస్తుంటే చంద్రబాబు మాత్రం బురద జల్లటమే పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఆరోపణలను ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరని ఆమె అన్నారు.

రైతులకు వ్యతిరేకంగా జీవోలు వచ్చాయని, వాటిని తగలబెట్టి నిరసన తెలపాలని చెప్పడం చూస్తుంటే ఎంత దిగజారిపోయారో అర్థమవుతుందన్నారు. రైతే రాజన్న విధంగా రైతు అడిగినవి, అడగనవి కూడా చేసి రైతుకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి జగన్ అని రోజా వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ జగన్ ను దేవుడిగా గుడికట్టుకుంటే.. ప్రతిపక్ష రాక్షసుడు చంద్రబాబు ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.

కాగా టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో జరిగిన భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తానేం తప్పు చేశానో తనకు తెలియదని అన్నారు. జగన్ నాటకాలు నమ్మి జనం పూనకం వచ్చినట్లు ఓట్లేశారని అన్నారు. ప్రజలంతా అభివృద్ధి చెందాలని కృషి చేశానన్న చంద్రబాబు...అదే తాను చేసిన తప్పైతే తనను క్షమించాలని కోరారు. కృష్ణా పరిటాల వద్ద ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రజా వ్యతిరేక జీఓ కాపీలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని.. రైతులు ఎక్కడా ఆనందంగా లేరని అన్నారు. రైతు కూలీలు చితికిపోయారని తెలిపారు. ప్రజావ్యతిరేకతపై నిర్ణయాలు మీద నిర్ణయాలు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.

వరుస విపత్తులతో రైతులు నష్టపోతే ఎలాంటి పరిహారం ఇవ్వలేదని చంద్రబాబు ఆరోపించారు. అసత్యాలతో రైతుల్ని దగా చేస్తున్నారని ఆరోపించారుప్రజావేదిక కూల్చి ఇంతవరకు శిథిలాలు తీయకుండా పైశాచిక ఆనందం పొందే శాడిస్టు జగన్ అపి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక డెకాయిట్ మాదిరి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి రెండు కళ్లయిన అమరావతి, పోలవరాన్ని పొడిచేశారన్నారు. లక్షా 30వేల కోట్ల అప్పు, 70వేల కోట్ల పన్నులు మోపారని తెలిపారు. ప్రతి ఒక్కరిపై ఇప్పటికే రూ.70వేలు భారం మోపారన్నారు. కుటుంబంలో నలుగురు ఉంటే రూ.2.80లక్షల భారం పడిందని.. ఈ భారం జీవితాంతం మోస్తూ ఊడిగం చేసే పరిస్థితి తెచ్చారని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Published by: Purna Chandra
First published: January 13, 2021, 2:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading