HOME »NEWS »POLITICS »andhra pradesh ysrcp mla anna rambabu slams janasena chief pawan kalyan over murder allegations and challenged him to contest in giddalur prn

AP Politics: చిరంజీవి ఆశీస్సులతోనే గెలిచా.., దమ్ముంటే పవన్ నాపై గెలవాలి..,వైసీపీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

AP Politics: చిరంజీవి ఆశీస్సులతోనే గెలిచా.., దమ్ముంటే పవన్ నాపై గెలవాలి..,వైసీపీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ కల్యాణ్ పై మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రకాశం జిల్లా (Prakasham District) సింగరపల్లిలో జనసేన (Janasena Party) కార్యకర్త వెంగయ్యనాయుడు మృతి ఘటన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSR Congress), జనసేన పార్టీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా సింగరపల్లిలో జనసేన కార్యకర్త వెంగయ్యనాయుడు మృతి ఘటన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన పార్టీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై ఎమ్మెల్యే అన్నా రాంబాబు మండిపడ్డారు. జనసేన శవరాజకీయాలు చేస్తోందని ఆరోపించిన అన్నా రాంబాబు.., వెంగయ్య ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అసలేం జరిగిందో తెలుసుకోకుండా తనపై నిందలు వేయడం సరికాదన్నారాయన. జనవరి 18న వెంగయ్య కుటుంబ సభ్యులు ఇచ్చిన స్టేట్ మెంట్ కు ఆ తర్వాతి రోజు ఇచ్చిన స్టేట్ మెంట్ కు తేడా ఎందుకొచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. చనిపోయిన శవాలపై చిల్లర ఏరుకొని రాజకీయాలు చేస్తున్నారు తప్ప నిజమైన రాజకీయం చేయడం లేదని అన్నా రాంబాబు అరోపించారు.

    చిరంజీవి వల్లే గెలిచా..


    ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపైనా అన్నా రాంబాబు ఘాటుగా స్పందించారు. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి గెలిచింది వాస్తమేనన్న ఆయన., చిరంజీవి ఆశీస్సులతోనే గెలిచానని గర్వంగా చెప్పుకుంటానానన్నారు. అయ్యా, పవన్ కళ్యాణ్‌ గారు.. నిందలు వేసేటప్పుడు పరిస్థితులు, వాస్తవ పరిణామాలు ఎలా ఉంటాయో గమనించాలని కోరారు. పార్టీ పెట్టిన తర్వాత పవన్ కల్యాణ్ ఎవర్నైనా ప్రశ్నించారా? అని రాంబాబు నిలదీశారు. చంద్రబాబు ఎన్ని అరాచకాలు, రాజ్యాంగ వ్యతిరేక పనులు చేసినా, 23 మంది వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా.. పవన్‌ కళ్యాణ్‌ ఏనాడూ ప్రశ్నించలేదన్నారు. సీఎం వైఎస్ ప్రజల సమస్యలపై పోరాడి గెలిచారు తప్ప.. మీలాగా శవరాజకీయాలు చేయలేదని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో జగన్ ను చూసి పవన్ నేర్చుకోవాలన్నారు.

    పవన్ తో పోటీకి సై
    పవన్ మాటలు చూసి యువత ఇదే జీవితం అనే భావనతో జీవితాలు పాడుచేసుకోకుండా కాపాడితే చాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్క సీటు గెలిపిస్తేనే ఇంత అరాచకంగా మట్లాడుతున్నారు కాబట్టే.. ప్రజలు మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారన్నారు. ఇద్దరం ప్రజాకోర్టుకు వెళ్దామని.. పవన్ కల్యాణ్ కు దమ్ముంటే నాపై పోటీ చేసి గెలవాలన్నారు. పవన్ గెలిస్తే ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమని స్పష్టం చేశారు. చేగువేరా, సుభాష్ చంద్రబోస్, అల్లూరు సీతారామరాజు, మహాత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్ పేర్లు చెప్పే పవన్ కల్యాణ్ వారి సిద్ధాంతాలల్లో కొన్నైనా అనుసరించాలని హితవు పలికారు.

    నిన్న వెంగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు వార్నింగ్ ఇచ్చారు. రాంబాబుకు తగిన బుద్ధి చెప్పి తీరుతామని హెచ్చరించిన పవన్.., వైసీపీ పతనానికి గిద్దలూరులోనే నాంది పలుకుతామన్నారు.
    Published by:Purna Chandra
    First published:January 24, 2021, 18:36 IST

    टॉप स्टोरीज