హోమ్ /వార్తలు /రాజకీయం /

జనం మీదకు నోట్లను వెదజల్లిన వైసీపీ నేత

జనం మీదకు నోట్లను వెదజల్లిన వైసీపీ నేత

నమూనా చిత్రం

నమూనా చిత్రం

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం పరిధిలో ఓ వైసీపీ నేత జనం మీదకు నోట్లను వెదజల్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  ఎన్నికల ప్రచారంలో ధనప్రవాహాన్ని ఆపేందుకు ఎన్నికల సంఘం ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా... ఎక్కడో ఒక చోట నోట్ల కట్టలు మాత్రమే దొరుకుతూనే ఉన్నాయి. పోలీసులకు దొరికిన డబ్బుతో తమకు సంబంధం లేదంటూ రాజకీయ పార్టీలు చేతులు దులుపుకోవడం కూడా పరిపాటే. అయితే అప్పుడప్పుడు నేతలు స్వయంగా ప్రజలకు డబ్బు పంపిణీ చేసే దృశ్యాలు కూడా కెమెరా కంటికి చిక్కుతుంటాయి. తాజాగా కర్నూలు జిల్లాలో జరిగిన అలాంటి సంఘటన ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన వైసీపీ నేత ఒకరు జనం మీదకు నోట్లను వెదజల్లిన దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి.


  ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆళ్లగడ్డ నియోజకవర్గం సిరివెళ్లలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఇక్కడి నుంచి వైసీపీ తరపున బ్రిజేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వైసీపీ నేత నోట్లను జనం మీదకు జల్లిన దృశ్యాలు బయటపడటంతో... దీనిపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. వైసీపీ నేతలు డబ్బుతో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.


  జనం మీదకు నోట్లను వెదజల్లిన వైసీపీ నేత..వీడియో వైరల్


  First published:

  Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Lok Sabha Election 2019, Nandyal S01p17, Ys jagan, Ysrcp

  ఉత్తమ కథలు