Home /News /politics /

ANDHRA PRADESH YSR CONGRESS LEADERS SLAMS SEC NIMMAGADDA RAMESH KUMAR AND NARA CHANDRA BABU NAIDU OVER PANCHAYAT ELECTIONS PRN

Nimmagadda vs YCP Leaders: చంద్రబాబు మేనిఫెస్టోతో వైసీపీ చేతికి కొత్త ఆయుధం... నిమ్మగడ్డను టార్గెట్ చేస్తున్న అధికార పార్టీ

నిమ్మగడ్డ రమేశ్ కుమార్, వైఎస్ జగన్(ఫైల్ ఫొటో)

నిమ్మగడ్డ రమేశ్ కుమార్, వైఎస్ జగన్(ఫైల్ ఫొటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికలపై (Panchayat Elections) పంచాయతీ కొనసాగుతోంది. అటు ప్రభుత్వం, వైసీపీ లీడర్లు ఇటు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య వార్ ముదిరింది. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh kumar) అధికారులపై తీసుకున్న చర్యలను అమలు చేసేందుకు నిరాకరిస్తోంది.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలపై పంచాయతీ కొనసాగుతోంది. అటు ప్రభుత్వం, వైసీపీ లీడర్లు ఇటు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య వార్ ముదిరింది. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ అధికారులపై తీసుకున్న చర్యలను అమలు చేసేందుకు నిరాకరిస్తోంది. పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ పై అభిశంసన సిఫార్సులను ప్రభుత్వం వెనక్కి పంపింది. ఈనెల 25న వారిని బదిలీ చేయవద్దంటూ నిమ్మగడ్డ జారీ చేసిన ఆదేశాలను సాక్ష్యంగా చూపిస్తూ చూపి వారిపై చర్యలకు నిరాకరించింది. మరవైపు నామినేషన్లకు రంగం సిద్ధమైనా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా కలెక్టర్లు, ఎస్పీలు పోలీసుల బదిలీల అంశంపై నిమ్మగడ్డను తప్పుబడుతున్నారు. అలాగే చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టో ఆధారంగా ఎస్ఈసీని టార్గెట్ చేస్తున్నారు.

    నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పోస్టును అడ్డంపెట్టుకొని అందర్నీ బ్లాక్ మెయిలింగ్ చేయాలని చూస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. నిమ్మగడ్డ చంద్రబాబుకు బంట్రోతులా పనిచేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ రాజ్యాంగ స్ఫూర్తి తో కాకుండా చంద్రబాబు స్ఫూర్తితో పని చేస్తున్నారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. తన మాట వినని అధికారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్.., చంద్రబాబు పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడంపై చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు.

    రాజకీయాలతో సంబంధం లేని గ్రామ పంచాయతీ ఎన్నికలకు మ్యానిఫెస్టో ఎలా విడుదల చేస్తారని ఆయన నిలదీశారు. చంద్రబాబు పార్టీ రహిత ఎన్నికలను పార్టీ ల పరిధిలోకి తీసుకొచ్చే విధంగా విష ప్రచారం చేస్తున్నారు. దీనిమీద నిమ్మగడ్డ చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు. వైసీపీ కంప్లైట్ ఇస్తేనే యాక్షన్ తీసుకుంటారా..? అని ప్రశ్నించిన అంబటి రాంబాబు.. ఇది ఎస్ఈసీకి శీల పరీక్షని.. ఆయన శీలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు మీద చర్యలు తీసుకోవడమే కాకుండా.., టీడీపీ గుర్తును రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తానని ఎస్ఈసీని చెప్పాలని డిమాండ్ చేశారు.

    ఇక చంద్రబాబు నిమ్మగడ్డ రిలేషన్ పై అంబటి తనదైన స్టైల్ లో పంచ్ లు వేశారు. నిజానికి చందుబాబు ఆత్మ నిమ్మగడ్డలో చంద్రముఖిలా ప్రవేశించి కలెక్టర్ల నుంచి, ఎస్పీల వరకు, జిల్లా అధికారలు వరకు, చివరకు పంచాయతీరాజ్‌ కమిషనర్, ముఖ్య కార్యదర్శి వరకు అందరి మొహాల్లో మొహం పెట్టి లక లక అంటున్నారని ఎద్దేవా చేశారు. మరి ఇటువంటి నిమ్మగడ్డలో చంద్రబాబు ఆత్మ కాకపోతే తక్షణం చంద్రబాబు చేసిన చెత్త పనులపై రాజ్యాంగపరంగా దండెత్తాలి కదా? పంచాయతీ ఎన్నికల్లో పార్టీ రాజకీయం ఎక్కడి నుంచి వచ్చిందిని, మేనిఫెస్టో ఎలా విడుదల చేశారని ఇప్పటికే ప్రెస్‌ మీట్‌ పెట్టాలి కదా? కేసు పెట్టాలని పోలీసులను ఆదేశించాలి కదా? అటువంటి పనులు చేయడం లేదంటేనే నిమ్మగడ్డలో ఉన్న చంద్రముఖి అసలు రూపం అందరికీ కనిపిస్తోందని కౌంటర్లు వేశారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Ambati rambabu, Ap local body elections, Chandrababu naidu, Gram Panchayat Elections, Nimmagadda Ramesh Kumar, Peddireddy Ramachandra Reddy, Tdp, Ysrcp

    తదుపరి వార్తలు