ANDHRA PRADESH YS SHARMILA TO START ELECTION CAMPAIGN FROM MANGALAGIRI TODAY MAY TARGET TDP AND LOKESH AK
టార్గెట్ లోకేశ్... నేడు మంగళగిరిలో షర్మిల ఎన్నికల ప్రచారం
వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)
YS Sharmila Election Campaign | నేటి నుంచి బస్సుయాత్ర చేపట్టనున్న వైఎస్ షర్మిల... ముందుగా మంగళగిరిలో జరగబోయే సభలో పాల్గొననున్నారు. ఏపీ మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్ టార్గెట్గా షర్మిల ఎలాంటి విమర్శలు చేస్తారన్నది రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల ఎన్నికల ప్రచారం నేటి నుంచి మొదలుకానుంది. ఎన్నికల ప్రచారం పతాకస్థాయికి చేరుకోవడంతో... ప్రజలను ఆకట్టుకునేందుకు వైఎస్ షర్మిలను ప్రచారంలోకి దింపాలని వైసీపీ నిర్ణయించింది. అందులో భాగంగానే నేటి నుంచి బస్సుయాత్ర చేపట్టనున్న షర్మిల... ముందుగా మంగళగిరిలో జరగబోయే సభలో పాల్గొననున్నారు. ఏపీ మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్ టార్గెట్గా షర్మిల ఎలాంటి విమర్శలు చేస్తారన్నది రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది. ఇప్పటికే లోకేశ్ టార్గెట్గా విమర్శలు గుప్పించిన షర్మిల... నేటి నుంచి ప్రత్యక్ష ప్రచారంలోకి వస్తుండటం వైసీపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపుతుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని తాడేపల్లి నుంచి బస్సుయాత్ర మొదలుపెట్టనున్న షర్మిల... గుంటూరు, కృష్ణాతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ప్రచారం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. టీడీపీ, జనసేన బలంగా ఉందని భావిస్తున్న నియోజకవర్గాల్లోనూ షర్మిల ఎన్నికల ప్రచారం చేపట్టేలా వైసీపీ నేతలు ప్లాన్ చేసినట్టు సమాచారం. మొత్తానికి లోకేశ్ పోటీ చేయబోతున్న మంగళగిరి నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టునున్న షర్మిల... ప్రచారంలో తన అన్న జగన్కు ధీటుగా టీడీపీని, జనసేనను టార్గెట్ చేస్తారేమో చూడాలి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.