ANDHRA PRADESH YS JAGANMOHAN REDDY YSRCP TO ROPE IN GRAM WARD VOLUNTEERS AS SARPANCH CANDIDATES BA
AP Panchayat Elections: నిమ్మగడ్డ ఎత్తుకు వైసీపీ పై ఎత్తు.. ఎస్ఈసీకి ఈ రూట్లో కౌంటర్
నిమ్మగడ్డ రమేష్ కుమార్, జగన్ (ఫైల్ ఫొటో)
ఏపీలో చాలా చోట్ల ఈ ప్లాన్ అమలు చేయాలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ విజయవంతం అయిందని, గ్రామ వాలంటీర్లు చేస్తున్న సేవలకు మెచ్చి ప్రజలు ఓట్లు వేస్తారని భావిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఓ గ్రామ వాలంటీర్ సర్పంచ్ అభ్యర్థిగా ఓ మహిళా గ్రామ వాలంటీర్ పోటీ చేస్తోంది. గ్రామ వాలంటీర్‌గా ఆమె చేసిన సేవలను గమనించిన గ్రామస్తులు ఆమెను సర్పంచ్‌గా ఎన్నుకుంటే మరింత ప్రజాసేవ చేస్తుందని భావిస్తూ ఎన్నికల బరిలో దింపారు. ఏపీలోని అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని ప్రసన్నాయపల్లిలో సత్యవతి అనే మహిళ.. ప్రభుత్వం గ్రామ వాలంటీర్లుగా ఎంపిక చేసినప్పుడు ఎంపికైంది. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకుని వెళ్లడంలో ముందువరుసలో ఉన్న సత్యవతికి అధికారులు మండల ఉత్తమ గ్రామ వాలంటీర్ అవార్డుతో సత్కరించారు. అయితే, ఈసారి గ్రామస్తులు మరో ముందడుగు వేశారు. గ్రామ వాలంటీర్‌గా సేవలు అందించిన ఆమెను సర్పంచ్‌ను చేస్తే బాగుంటుందని భావించి ఆమె పేరును ప్రతిపాదించారు. ఆమెకు వైసీపీ నేతలు కూడా మద్దతు తెలుపుతున్నట్టు తెలిసింది.
ఏపీలో చాలా చోట్ల ఈ ప్లాన్ అమలు చేయాలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ విజయవంతం అయిందని, గ్రామ వాలంటీర్లు చేస్తున్న సేవలకు మెచ్చి ప్రజలు ఓట్లు వేస్తారని భావిస్తోంది. ఓ వైపు వీలున్నన్ని చోట్ల ఏకగ్రీవాలు చేయాలని పిలుపునిస్తూ ప్రోత్సాహకాలు ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం, మరోవైపు ఎన్నికలు తప్పనిసరి అయినచోట ఇలా గ్రామ వాలంటీర్లను బరిలో దింపితే అక్కడ ప్రజలు వాలంటీర్ల వైపు మొగ్గుచూపే అవకాశం ఉందని భావిస్తోంది. ఈ ప్రతిపాదనకు వైసీపీ నేతలు కూడా మద్దతు పలుకుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరగవు. కానీ, గ్రామ వాలంటీర్లు అంతా వైసీపీ కార్యకర్తలే అనే విమర్శ ఉంది. ప్రతిపక్షాలు కూడా గ్రామ వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలే అనే అభిప్రాయంలో ఉన్నాయి.
ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇటీవల ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ వాలంటీర్లను ఎన్నికల విధులకు వినియోగించవద్దని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల విధులకు గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు దూరంగా ఉండాలని ఉత్తర్వులు జారీ చేశారు. వాలంటీర్లుగా ఉన్న ఉద్యోగస్తులంతా ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ ఫోన్లను తిరిగిచ్చేయాలని., అలాగే వాలంటీర్లెవరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల మందికి పైగా గ్రామ వాలంటీర్లు, దాదాపు 60వేల మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వీరంతా ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు నేరుగా అందిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ అమలులో ఉన్నంతకాలం ఈ ఆదేశాలు అమలో ఉంటాయని ఎస్ఈసీ స్పష్టం చేశారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.