హోమ్ /వార్తలు /రాజకీయం /

జగన్ లాస్ట్ పంచ్ పవన్ కళ్యాణ్‌కేనా ?

జగన్ లాస్ట్ పంచ్ పవన్ కళ్యాణ్‌కేనా ?

పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్

పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్

ఏపీలో టీడీపీని ఓడించడంతో పాటు పవన్ కళ్యాణ్‌ను అసెంబ్లీకి రాకుండా చేయాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పట్టుదలగా ఉన్నారని... ఈ కారణంగానే ఆయన పోటీ చేస్తున్న రెండు స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి.

  ఏపీలోని మెజార్టీ నియోజకవర్గాలను తన పాదయాత్ర ద్వారా కవర్ చేశారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. తాజాగా ఎన్నికల ప్రచారం నేపథ్యంలో పాదయాత్రలో టచ్ చేయని నియోజకవర్గాలపైనే జగన్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. జగన్ పర్యటించని నియోజకవర్గాల్లో షర్మిల, విజయలక్ష్మీ ప్రచారం చేస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారానికి చివరి రోజు అయిన ఈ నెల 9న జగన్ ఎక్కడ ప్రచారం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే వైసీపీ వర్గాలు వర్గాలు మాత్రం వైఎస్ జగన్ లాస్ట్ పంచ్ ఇవ్వబోయేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కే అని చర్చించుకుంటున్నారు.


  ఎన్నికల ప్రచారానికి ఆఖరి గడువు అయిన ఏప్రిల్ 9న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విశాఖ జిల్లా గాజువాకలో ప్రచారం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో.... జగన్ లాస్ట్ పంచ్ పవన్ కళ్యాణ్‌కు ఇవ్వబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంతో పాటు విశాఖ జిల్లా గాజువాకలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్‌ను రెండు నియోజకవర్గాల్లోనూ ఓడించాలని వైసీపీ పట్టుదలగా ఉంది. భీమవరంలో పవన్ కళ్యాణ్‌కు వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీను గట్టి పోటీ ఇస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న గాజువాకపై ఫోకస్ చేశారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.


  ఏపీలో టీడీపీని ఓడించడంతో పాటు పవన్ కళ్యాణ్‌ను అసెంబ్లీకి రాకుండా చేయాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పట్టుదలగా ఉన్నారని... ఈ కారణంగానే ఆయన పోటీ చేస్తున్న రెండు స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో భీమవరం, గాజువాక నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందనే దానిపై వైసీపీ అధినేత ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది. వీటి ఆధారంగానే ఈ రెండు నియోజకవర్గాల్లో జగన్ ఎక్కడ ప్రచారం చేస్తారనే అంశం ఆధారపడి ఉంటుందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి ఎన్నికల ప్రచారంలో లాస్ట్ పంచ్ పవన్ కళ్యాణ్‌కే ఇవ్వాలని భావిస్తున్న జగన్‌కు పవన్ కళ్యాణ్ ఏ రకంగా కౌంటర్ ఇస్తారో చూడాలి.





  First published:

  Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Bhimavaram, Lok Sabha Election 2019, Narsapuram S01p09, Pawan kalyan, Visakhapatnam S01p04, Ys jagan

  ఉత్తమ కథలు