మాజీమంత్రికి మళ్లీ మంత్రి పదవి... ముందే ప్రకటించిన జగన్

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పని చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డికి జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఆయనకు కేబినెట్ బెర్త్ ఖాయమని ప్రకటించారు.

news18-telugu
Updated: April 3, 2019, 5:19 PM IST
మాజీమంత్రికి మళ్లీ మంత్రి పదవి... ముందే ప్రకటించిన జగన్
వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే ఉన్నాయి. పోటీలో మూడు పార్టీలు ఉన్నా... ప్రధాన పోటీ మాత్రం టీడీపీ, వైసీపీ మధ్యే ఉందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఏపీ ఎన్నికల్లో వైసీపీ గెలిచే అవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయనే ఊహాగానాలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. మళ్లీ తమదే అధికారం అని టీడీపీ నేతలు కూడా ధీమాగానే ఉన్నారు. మరోవైపు ఈ సారి అధికారం తమదే అనే ధీమాలో వైసీపీ నేతలు... గెలిస్తే జగన్ ఎవరికి మంత్రి పదవులు ఇస్తారనే దానిపై కూడా చర్చించుకోవడం మొదలుపెట్టారు. మిగతా వారి సంగతి ఎలా ఉన్నా... గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పని చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డిని తమ పార్టీ అధికారంలోకి వస్తే కేబినెట్ బెర్త్ ఖాయమని ప్రకటించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

ఒంగోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి... టీడీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే తనకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని మంత్రిని చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఒంగోలులో బాలినేనిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరిన జగన్... తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనకు మంత్రి పదవి ఇస్తానని ప్రకటించారు. జగన్ ప్రకటనతో ప్రకాశం జిల్లా నుంచి వైసీపీ తరపున బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రిగా అవకాశం ఖాయం కావడంతో... వైసీపీ అధికారంలోకి వస్తే బాలినేని మినహా మరొకరికి జిల్లా నుంచి కేబినెట్‌లో చోటు దక్కే అవకాశాలు ఉండకపోవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

First published: April 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com