మరో వైసీపీ అభ్యర్థికి మంత్రి పదవి ప్రకటించిన జగన్... లోకేశ్‌పై గెలిస్తే...

మే 12న ఆయన తిరిగి హైదరాబాద్ వస్తారు. సుమారు 10 రోజుల పాటు ఆయన లండన్‌లోనే ఉంటారు.

చంద్రబాబు పార్టనర్ అయిన పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ప్రచారం చేయలేదని... చంద్రబాబు గాజువాక, భీమవరంలో ప్రచారం చేయలేదని జగన్ వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక్కటే అనే విషయం అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.

  • Share this:
    ఎన్నికల ప్రచారంలో పలువురు వైసీపీ అభ్యర్థులు గెలిస్తే... తన కేబినెట్‌లో మంత్రిని చేస్తానని ప్రకటించిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి... తాజాగా మరో అభ్యర్థికి కూడా అలాంటి బంపర్ ఆఫర్ ఇచ్చారు. మంగళగిరిలో ఏపీ మంత్రి, చంద్రబాబు తనయుడు కొడుకు నారా లోకేశ్‌పై పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే... తన మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని జగన్ ప్రకటించారు. నారా లోకేశ్, చంద్రబాబు... ఎప్పుడూ మంగళగిరికి వచ్చింది లేదని జగన్ ఆరోపించారు. ఇక్కడ భూములను అధికార పార్టీ నేతలు దోచుకుంటున్నారని మండిపడ్డారు.

    చంద్రబాబు పార్టనర్ అయిన పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ప్రచారం చేయలేదని... చంద్రబాబు గాజువాక, భీమవరంలో ప్రచారం చేయలేదని జగన్ వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక్కటే అనే విషయం అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఓడిపోతున్నాడనే విషయం స్పష్టంగా తెలిసినా... కొన్ని పత్రికలు, ఛానళ్లు గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టాయని వైఎస్ జగన్ ఆరోపించారు. చంద్రబాబు ఏపీలో అద్దె ఇంట్లో ఉంటున్నాడని... కానీ తాను మాత్రం ఇదే నియోజకవర్గంలో సొంత ఇల్లు కట్టుకుని ఉంటున్నానని వైసీపీ అధినేత వ్యాఖ్యనించారు. మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయని... అంతా మనసాక్షికి కట్టుబడి ఓటు వేయాలని జగన్ కోరారు.
    First published: