Home /News /politics /

RRR: ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు..! లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ ఫిర్యాదు

RRR: ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు..! లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ ఫిర్యాదు

ఏంపీ రఘురామపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు

ఏంపీ రఘురామపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు

జాతీయ స్థాయిలో డ్యామేజ్ కంట్రోల్ పై వైసీపీ చర్యలు ప్రారంభించింది. ఎంపీ రఘరామ వ్యవహారానికి త్వరగా ఎండ్ కార్డు వేయాలని భావిస్తోంది. అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఏపీ సీఎం జగన్ కలిసిన కొన్ని గంటల్లోనే.. రఘురామపై వేటు వేయాలని స్పీకర్ కు వైసీపీ ఎంపీ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఇంకా చదవండి ...
  వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు -అధికార వైసీపీ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఎంపీ అరెస్ట్ ఆ తరువాత తనను కస్టడీలో చిత్ర హింసలకు గురి చేశారని రఘురామ ఫిర్యాదుతో వ్యవహారం జాతీయ రాజకీయాల్లోనూ చర్చగా మారింది. ముఖ్యంగా సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన తరువాత.. ఆయన ఢిల్లీలోనే ఉంటూ అన్ని పార్టీల ఎంపీలకు తనకు జరిగిన అన్యాయం పై లేఖలు రాశారు. ఆయనకు అన్ని పార్టీల నుంచి మద్దతు పెరిగింది. మరోవైపు అన్ని రాష్ట్రాల సీఎంలకు సైతం ఆయన లేఖలు రాశారు. బీజేపీ కేంద్ర పెద్దలు సైతం ఆయన వ్యవహారం తెలుసుకుని.. ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టు సమాచారం జరుగుతోంది. దీంతోనే సీఎం జగన్-అమిత్ షా భేటీలో ఈ అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇలా జాతీయ స్థాయిలో ఏపీ ప్రభుత్వంపై దాడిని పెంచారు ఎంపీ రఘరామ.. దీంతో జాతీయ స్తాయిలో సీఎం జగన్ కు కాస్త డ్యామేజ్ అయ్యిందనే చెప్పాలి.. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారానికి త్వరగా పులిస్టాప్ పెట్టాలని వైసీపీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఎంపీ రఘురామకృష్ణంరాజు అనర్హత వేటు వ్యవహారం మళ్ల తెరపైకి వచ్చింది.

  లోక్ సభ స్పీకర్ ఓ బిర్లాను కలిసి వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రఘురామ అతిక్రమించారని ఆరోపించారు. తన ఫిర్యాదు ఆధారంగా ఆలస్యం చేయకుండా వెంటనే రఘురామపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు భరత్ విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకున్న కొన్ని గంటలు కూడా గడవకముందే స్పీకర్ కు భరత్ ఫిర్యాదు చేయడంపైనా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర పెద్దలకు విషయాన్ని వివరించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

  గతంలో సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, వైసీపీ నేతలపై ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే..ఈ వ్యాఖ్యలను రఘురామ సమర్థించుకున్నారు. ప్రభుత్వంపై తాను చేసినట్లుగా చూడాలి.. కానీ పార్టీపై చేస్తున్నట్లుగా చూడొద్దని ఆయన సూచిస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల కిందకు రాదని, రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించడం లేదని ఆయన చెప్పుకొస్తున్నారు. దీనిపై స్పీకర్‌కు సైతం క్లారిటీ ఇచ్చారు.

  ఆ తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఐడీ కేసు, రఘురామకృష్ణంరాజు అరెస్టు జరిగాయి. విడుదలైన తరువాత జైలులో చిత్రహింసలకు గురి చేశారు.. ఎంపీ అని చూడలేదని.. తన గౌరవానికి భంగం కలిగిందని.. సీఐడీపై చర్యలు తీసుకోవాలని లోక్ సభ స్పీకర్ కు రఘురామ ఫిర్యాదు చేశారు. వివిధ కేంద్ర మంత్రులను కలవడం, సీఎంలకు లేఖలు రాయడంపై వైసీపీ తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రస్తుతం వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ చేసిన ఫిర్యాదుపై ఎంపీ రఘురామ ఎలా స్పందిస్తారో చూడాలి.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, MP raghurama krishnam raju

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు