• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • ANDHRA PRADESH WILL ALI GIVE COUNTER TO PAWAN KALYAN ON HIS COMMENTS REGARDING HIM AK

‘ఇదేనా స్నేహం’... పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అలీ స్పందిస్తారా ?

‘ఇదేనా స్నేహం’... పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అలీ స్పందిస్తారా ?

అలీ పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటోలు)

అలీ సూచించిన వ్యక్తికే నరసారావుపేట ఎంపీ టికెట్ ఇచ్చానని..కానీ ఆయన మాత్రం వైసీపీకి ప్రచారం చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. అలీని వైసీపీ వాడుకుని వదిలేసిందని తెలిపారు. అయితే ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ అలీని ఎందుకు టార్గెట్ చేశారన్నది ఎవరికీ అర్థంకావడం లేదు.

  • Share this:
    రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. సినిమాల్లో కలిసి నటించిన వారంతా... రాజకీయాల్లోనూ కలిసి ప్రయాణం చేయాలనే నిబంధన ఏమీ లేదు. అందుకే సినిమాల్లో కలిసి నటించేవారిలో చాలామంది వేర్వేరు పార్టీల్లో చేరిపోతుంటారు. అవసరం, సందర్భాన్ని బట్టి ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు కూడా చేసుకుంటుంటారు. ఇవన్నీ ఎలా ఉన్నా... కొద్ది రోజుల క్రితం వైసీపీలో చేరిన సినీనటుడు అలీపై జనసేన అధినేత, స్టార్ హీరో పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. తన స్నేహితుడు, టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ తనను మోసం చేశారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

    అలీని నమ్మితే..మోసం చేసి వెళ్లిపోయాడని విమర్శించారు. అలీ సూచించిన వ్యక్తికే నరసారావుపేట ఎంపీ టికెట్ ఇచ్చానని..కానీ ఆయన మాత్రం వైసీపీకి ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అలీని వైసీపీ వాడుకుని వదిలేసిందని తెలిపారు. అయితే ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ అలీని ఎందుకు టార్గెట్ చేశారన్నది ఎవరికీ అర్థంకావడం లేదు. అలీ సొంతూరు అయిన రాజమండ్రిలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే వైసీపీ తరపున పోటీలో లేని అలీని విమర్శించాల్సిన అవసరం పవన్‌కు ఏమొచ్చిందనే విషయం అంతుచిక్కడం లేదు. వైసీపీలో చేరినా... ఇప్పటివరకు అలీ పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేయలేదు. పైగా పవన్ రాజకీయంగా ఎదగాలని తాను కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు.

    అయితే పవన్ కళ్యాణ్ తాజా విమర్శలకు అలీ కౌంటర్ ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు అలీ కౌంటర్ ఇవ్వకపోతే... అది రాజకీయంగా వైసీపీకి ఇబ్బంది కలిగించే పరిణామం అవుతుందనే వాదన ఉంది. అయితే అలీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తే... ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ మరింతగా పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి తనను విమర్శించిన పవన్ కళ్యాణ్‌ వ్యాఖ్యలకు అలీ రియాక్ట్ అవుతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు