Home /News /politics /

ANDHRA PRADESH VILLAGER SOLD THEIR VOTES FOR RS 20 LAKHS INSTEAD OF USING FOR PANCHAYAT DEVELOPMENT IN YSR KADAPA DISTRICT HERE ARE THE DETAILS PRN

AP Panchayat Elections: 240 ఓట్లు.. రూ.20 లక్షలు.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AP Panchayat Elections: వేలంలో వచ్చిన నగదుతో గ్రామంలో అభివృద్ధి పనులకు వినియోగించడం ఆనవాయితీ కానీ ఓ గ్రామంలో మాత్రం వేలపాట డబ్బును ఓటర్లకే పంచడం చర్చనీయాంశమైంది.

    ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు ఈ సారి ఎన్నడూ లేనంత రంజుగా సాగుతున్నాయి. ఎన్నికల కమిషన్ తో రాష్ట్ర ప్రభుత్వ వైరంతో పల్లెపోరుకు ఎక్కడాలేని ప్రాధాన్యత లభించింది. మరోవైపు పంచాయతీల్లో ఏకగ్రీవాల సందడి నెలకొంటోంది. ఎన్నికల్లో అనవసర గొడవలు ఎందుకులే అని కొన్ని పంచాయతీలు ఏకగ్రీవమవుతుంటే.. మరి కొన్ని చోట్ల మాత్రం వేలం పాటలు సాగుతున్నాయి. వేలంలో గెలిచిన అభ్యర్థికే గ్రామ పెద్దలు సర్పంచ్ పీఠాన్ని కట్టబెడుతున్నారు. ఈసారి గ్రామపంచాయతీల వేలంపాటలు రూ.50లక్షల మార్క్ దాటేశాయి. వేలంలో వచ్చిన నగదుతో గ్రామంలో అభివృద్ధి పనులకు వినియోగించడం ఆనవాయితీ కానీ ఓ గ్రామంలో మాత్రం వేలపాట డబ్బును ఓటర్లకే పంచడం చర్చనీయాంశమైంది. ఏపీలోని కడప జిల్లా కమలాపురం మండలంలోని ఓ గ్రామ పంచాయతీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

    కమలాపురం మండలంలోని చిన్నపంచాయతీగా ఉన్న ఆ గ్రామంలో కేవలం 240 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ప్రతిసారి రిజర్వేషన్ లో ఉండే ఈ పంచాయతీ ఈసారి జనరల్ కేటగిరీకి వచ్చింది. గ్రామంలో రెండోదశలో పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఐతే పంచాయతీ సర్పంచ్ పీఠంపై కన్నేసిన ఓ అభ్యర్థి వైసీపీ మద్దతుతో బరిలో దిగుదామని భావించాడు.

    ఐతే ఎన్నికల వరకు ఆగడం ఎందుకనుకున్నాడో ఏమో.. గ్రామపెద్దల ముందు ఓ బంపర్ ఆఫర్ ఇంచాడు. రూ20 లక్షలు ఇస్తానని.. సర్పంచ్ పదవి తనకే ఇవ్వాలని చెప్పాడు. అందుకు గ్రామస్తులు కూడా ఓకే చెప్పారు. ఐతే ఆ మొత్తాన్ని గ్రామాభివృద్ధికి కాకుండా.. ఓటర్లకు పంచేందుకు ఒప్పం చేసుకున్నారు. ఆ లెక్కన గ్రామంలోని ఒక్కో ఓటుకు రూ.8వేల చొప్పున పంచాలని నిర్ణయించారు. దీంతో గ్రామస్తులే సదరు అభ్యర్థికి పోటీ లేకుండా చేయడానికి ఇతరులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

    ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లాలోని కలిగిరి మండలంలో ఓ గ్రామపంచాయతీకి స్థానికులు వేలం నిర్వహించారు. గ్రామంలో సర్పంచ్ పదవికి తొలుత ఆరుగురు పోటీలో నిలిచారు. ఐతే తనకు సర్పంచ్ పదవి ఇస్తే 29లక్షల రూపాయలిస్తానని ఓ అభ్యర్థి గ్రామ పెద్దలకు ఆఫర్ ఇచ్చాడు. కానీ వారు మాత్రం రూ.50 లక్షలు ఇస్తే ఓకే అని పరిశీలిస్తామన్నారు. దీంతో ఆ అభ్యర్థి దానికి అంగీకరించాడు. ఈ విషయంలో తెలుసుకున్న మరో వ్యక్తి తాను రూ.50.25 లక్షలు ఇస్తానని మందుకొచ్చాడు. చివరకు మొదటగా ముందుకొచ్చిన అభ్యర్థి రూ.50.50లక్షలు చెల్లించి సర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నాడు. పాట పాడిన వెంటనే డబ్బులు కూడా చెల్లించడంతో మిగిలిన వారు పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ నిధులను గ్రామమాభివృద్ధి ఖర్చు చేయాలని గ్రామస్తులు తీర్మానించారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap local body elections, Gram Panchayat Elections, Kadapa, Local body elections

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు