టీడీపీలో మొదలైన సెగలు... చంద్రబాబుపై తమ్ముళ్ల మాటల మంటలు...

Andhra Pradeh Updates : ఎన్నికల ఫలితాలతో నైరాశ్యంలో కూరుకుపోయిన తమ్ముళ్లు... ఇప్పుడెందుకు చంద్రబాబుపై ఫైర్ అవుతున్నారు? పరాజయంలో చంద్రబాబు పాత్ర ఎంత?

Krishna Kumar N | news18-telugu
Updated: June 15, 2019, 7:23 AM IST
టీడీపీలో మొదలైన సెగలు... చంద్రబాబుపై తమ్ముళ్ల మాటల మంటలు...
చంద్రబాబు (File)
Krishna Kumar N | news18-telugu
Updated: June 15, 2019, 7:23 AM IST
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు వారాలు దాటింది. ఇన్నాళ్లూ... సైలెంట్‌గా ఉన్న తమ్ముళ్లు... ఇప్పుడు గళం విప్పుతున్నారు. పార్టీ ఓటమికి అధినేత చంద్రబాబే కారణం అంటున్నారు. వైసీపీ సభ్యులు 151 మందితో అసెంబ్లీ కళకళలాడుతుంటే... అది చూసిన తమ్ముళ్లు... చేతులారా అధికారాన్ని కోల్పోయామనీ, చంద్రబాబు తీరుతో వాస్తవాలు తెలియకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014లో 102 మంది సభ్యులతో అసెంబ్లీలో నిండుగా కనిపించిన టీడీపీ... ఇప్పుడు 23 మందికే పరిమితం అవ్వడంతో... అది తట్టుకోలేకపోతున్న తమ్ముళ్లు... చంద్రబాబుపై తమ అసంతృప్తిని బయటపెడుతున్నారు. టెక్నాలజీ అంటూ చంద్రబాబు ఆకాశానికి నిచ్చెనలు వేశారనీ... రాజధాని నిర్మాణం విషయంలోనూ సింగపూర్, జపాన్ అంటూ కాలయాపన సాగించారనీ ఫలితంగా ప్రజలకు టీడీపీ దూరమైపోయిందని తెరవెనక మండిపడుతున్నారు.

టీడీపీని ముంచిన టెలీ కాన్ఫరెన్స్ : జిల్లాల్లో, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తెలుసుకోవడానికి చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌లపై ఎక్కువగా ఆధారపడ్డారు. ఎప్పుడు, ఏం జరిగినా తనకు చెప్పాలని పార్టీ కార్యదర్శులు, బూత్ లెవల్ ఇన్ఛార్జులకు ఆదేశాలిచ్చారు. అందుకు తగ్గట్టుగానే... టెలీ కాన్ఫరెన్స్‌లలో వారు చంద్రబాబుకు స్థానిక పరిస్థితులు వివరించారు. ఐతే... వాళ్లు నిజాలు చెప్పలేదనీ, వాస్తవ పరిస్థితి చెప్పకుండా... చంద్రబాబు మెప్పు పొందేందుకు అబద్ధాలతో సర్దిపుచ్చారని ఇప్పుడు టీడీపీ నేతలు లబోదిబో మంటున్నారు. వైసీపీ 151 స్థానాలు గెలిచిందంటే... టీడీపీపై ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు. టెలీకాన్ఫరెన్సుల్లో ఈ విషయాలేవీ బయటకు రాకపోవడం వల్లే, టీడీపీ ఘోరంగా దెబ్బతిందని చంద్రబాబుపై మండిపడుతున్నారు.

అధికారులపై ఆగ్రహం : చంద్రబాబు తమ కంటే, అధికారులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారనీ, వాళ్లు ఇచ్చే అసత్య నివేదికలే నిజం అని నమ్ముతూ భ్రమల్లో బతికారన్న విమర్శలు పార్టీ నేతల నుంచీ వినిపిస్తున్నాయి. చంద్రబాబు చుట్టూ చేరిన భజన బృందాలు... ఆయన్ని ఆకాశానికి ఎత్తుతూ... క్షేత్రస్థాయిలో పార్టీ ఎలా మునిగిపోతుందో తెలియకుండా చేశారన్న ఆరోపణలు పార్టీ పెద్దల నుంచీ వస్తున్నాయి. ఏది ఏమైనా... దీపం ఉండగా ఇల్లు చక్కదిద్దుకోలేకపోయిన తమ్ముళ్లు... ఇప్పుడు ఎవర్ని ఎన్ని తిట్టుకొని ఏం లాభం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 ఇవి కూడా చదవండి :

ఏపీలో కొత్త మద్యం పాలసీ... 10 శాతం వైన్ షాపులు ఔట్...

నేడు నీతి ఆయోగ్ సమావేశం... చర్చించే కీలక అంశాలు ఇవీ...
Loading...
Gyro Drop : అది ఫేక్ వీడియో... భలే నమ్మిస్తున్నారుగా...

రోజా పూలతో చక్కటి ఆరోగ్యం... ఇవీ ప్రయోజనాలు...
First published: June 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...