ఇండియా స్కిల్స్ రిపోర్ట్‌లో ఏపీ నెంబర్. 1

పనిచేసేందుకు అనువైన వాతావరణం ఉన్న మొదటి పది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలవగా, తెలంగాణ చివరి స్థానంలో ఉంది. అత్యంత ఉద్యోగార్హ నైపుణ్యాలున్న రాష్ట్రాల్లో గతేడాది ఏడో స్థానంలో నిలిచిన ఏపీ ఈసారి మొదటి స్థానం దక్కించుకుంది. గత నివేదికలో మొదటి పదిస్థానాల్లో కనిపించని తెలంగాణ .. ఈసారి మాత్రం 8వ స్థానంలో నిలిచింది.

news18-telugu
Updated: November 24, 2018, 10:50 AM IST
ఇండియా స్కిల్స్ రిపోర్ట్‌లో ఏపీ నెంబర్. 1
ఆంధ్రప్రదేశ్ మ్యాప్
  • Share this:
మరోసారి తమకు సాటిలేదని నిరూపించింది ఆంధ్రప్రదేశ్. దేశంలో అత్యధిక ఉద్యోగార్హ నైపుణ్యాలు ఉన్న మానవ వనరులు కలిగిన రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. పని చేసేందుకు అత్యంత అనువైన వాతావరణం ఉన్న రాష్ట్రాల విభాగంలోనూ ఉద్యోగుల నియామకానికి వివిధ కంపెనీలు మొగ్గు చూపే రాష్ట్రాల కేటగిరిలోనూ ఏపీ నెంబర్ వన్‌గా నిలిచింది. అన్ని రాష్ట్రాల్ని వెనక్కి నెట్ట అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

ఇండియా స్కిల్స్ రిపోర్ట్‌ 2019ని లఖ్‌నవూలో జరిగిన అంతర్జాతీయ నైపుణ్య సదస్సులో విడుదల చేశారు. ఉద్యోగార్హ నైపుణ్యాలున్న యువతను అత్యధికంగా సరఫరా చేసే రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ మరోసారి అగ్రస్థానంలో నిలిచి సత్తా చాటింది. 2016, 2018, 2019 నివేదికల్లోను ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో, 2017లో రెండో స్థానంలోనూ నిలిచింది. అత్యంత ఉద్యోగార్హ నైపుణ్యాలున్న రాష్ట్రాల్లో గతేడాది ఏడో స్థానంలో నిలిచిన ఏపీ ఈసారి మొదటి స్థానం దక్కించుకుంది. గత నివేదికలో మొదటి పదిస్థానాల్లో కనిపించని తెలంగాణ .. ఈసారి మాత్రం 8వ స్థానంలో నిలిచింది. పనిచేసేందుకు అనువైన వాతావరణం ఉన్న మొదటి పది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలవగా, తెలంగాణ చివరి స్థానంలో ఉంది.

అయితే అత్యంత ఎక్కువ సంఖ్యలో నియామక కార్యక్రమాలు జరిగే మొదటి మూడు రాష్ట్రాల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్‌కు చోటు దక్కలేదు. ఈ విభాగంలో 2018లో మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌.. 2019 నివేదికలో మాత్రం ఆ స్థానాన్ని కోల్పోయింది. ఈ విభాగంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. 2018 నివేదికలో.. మొదటి పది స్థానాల్లో ఉన్న ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులు 2019లో కూడా మొదటి పది స్థానాల్లో నిలిచాయి. ఈసారి హరియాణా, రాజస్థాన్‌, తెలంగాణ మొదటి పది రాష్ట్రాల జాబితాలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చాయి.
Published by: Sulthana Begum Shaik
First published: November 24, 2018, 8:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading