ANDHRA PRADESH TELUGU DESHAM PARTY CHIEF GIVE INSTRUCTIONS TO LEADERS TO WIN IN TIRUPATHI BY POLLS AND MADE ALLEGATIONS ON YCP GOVERNMENT PRN
Tirupathi by-poll: వైసీపీకి బుద్ధి చెప్పాలంటే ఇదొక్కటే మార్గం., పార్టీ నేతలకు చంద్రబాబు పిలుపు
చంద్రబాబునాయుడు (ఫైల్)
తిరుపతి ఉపఎన్నికపై (Tirupathi By-polls) తెలుగుదేశం పార్టీ (Telugu Desham party దృష్టి పెట్టింది. బై ఎలక్షన్ లో గెలుపు ద్వారా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి (YSR Congress Party) షాకివ్వాలని ప్రణాళికలు రచిస్తోంది.
తిరుపతి ఉపఎన్నికపై తెలుగుదేశం పార్టీ దృష్టి పెట్టింది. బై ఎలక్షన్ లో గెలుపు ద్వారా అధికార వైసీపీకి షాకివ్వాలని ప్రణాళికలు రచిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.., స్థానిక నేతలకు పిలుపునిచ్చారు. తిరుపతి నేతలతో సమీక్ష జరిపిన చంద్రబాబు ఈ ఎన్నిక ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరుపతి ఉపఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.వైసిపిని ఓడించడం ద్వారా చారిత్రాత్మకమైన తీర్పుకు తిరుపతి వేదిక కావాలి. దేశానికే ఒక సందేశాన్ని తిరుపతి ప్రజలు పంపాలని’’ చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇదే స్ఫూర్తితో జనవరి 21నుంచి 10రోజుల పాటు, 700 గ్రామాల్లో ప్రచారం ఉధృతం చేయాలి. టీడీపీ పాలనలో చేసిన అభివృద్ది, సంక్షేమాన్ని ప్రజలకు గుర్తు చేయాలి. వైసిపి వచ్చాక పెరిగిన దాడులు, విధ్వంసాలు, పన్నుల భారాలు, చేసిన అప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
అదే నినాదం..
టీడీపీ హయాంలో చిత్తూరు జిల్లాలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. హార్డ్ వేర్ హబ్ గా, మొబైల్ ఫోన్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా తిరుపతిని చేశామని., చిత్తూరు జిల్లాలో రూ లక్ష కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు చేసి 95వేల మందికి ఉపాధి కల్పించామని చెప్పారు. తిరుపతి, శ్రీసిటి, కృష్ణపట్నంలను ట్రైసిటిగా అభివృద్ది చేస్తే.., వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలను తరిమేస్తోందని ఆరోపిచారు. వైసిపి వచ్చాక ఒక్క కంపెనీ తేకపోగా ఉన్న అమర రాజా ఇన్ ఫ్రాటెక్ భూములు రద్దుచేశారాన్నారు. టిడిపి హయాంలో తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడాం, అన్నదానం, ప్రాణదానం ట్రస్ట్ లు ఏర్పాటు చేస్తే.., ఈ ప్రభుత్వం తిరుమల తిరుపతి పవిత్రతకే కళంకం తెచ్చిందని ఆరోపించారు.
సజ్జల స్క్రిప్ట్, జగన్ రెడ్డి డైరెక్షన్ లో డిజిపి యాక్షన్
రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులు సజ్జల స్క్రిప్ట్, జగన్ రెడ్డి డైరెక్షన్లో., డీజీపీ యాక్షన్ లో కొనసాగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 150 దాడులు, ధ్వంసాలు జరిగేదాకా ఉదాసీనంగా ఉన్నారని.., ఈ దాడులకు రాజకీయాలకు సంబంధం లేదు, ఉన్మాదుల పని, పిచ్చోళ్ల పనిగా భోగిరోజున డీజీపీనే చెప్పారన్నారు. ఇప్పుడు డీజీపీ మళ్లీ కనుమ రోజున మాటమార్చి దీనిని ప్రతిపక్షాలకు అంటగడుతున్నారని మండిపడ్డారు. 17 మంది టీడీపీ, నలుగురు బీజేపీ వాళ్లను అరెస్ట్ చేసినట్లు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారన్నారు. దేవాలయాలపై దాడులు చేసిన వైసిపి వాళ్లను కేసుల నుంచి వైసీపీ వాళ్లను తప్పించి.., దాడులను బైటపెట్టినవాళ్లపై కేసులు పెడ్తారా..? అని ప్రశ్నించారు. రామతీర్ధం వెళ్లామని నాపై, అచ్చెన్నాయుడిపై, కళా వెంకట్రావుపై తప్పుడు కేసులు పెడ్తారా..? మాకన్నా గంట ముందు వెళ్లి రెచ్చగొట్టిన విజయసాయి రెడ్డి, వైసిపి నాయకులపై కేసులు పెట్టరా..? అని చంద్రబాబు ప్రశ్నించారు.
రాష్ట్రం అప్పులపాలు
ప్రభుత్వం 0.25% అప్పుల కోసం రైతులు, పేదలపై రూ.70వేల కోట్ల పన్నులు వేశారని ఆరోపించారు. రైతుల మోటర్లకు మీటర్లు బిగించి ఉచిత విద్యుత్ ఎగ్గొట్టే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రూ.లక్షా 30వేల కోట్ల అప్పులు చేసి పేదల పథకాల పేరుతో కుంభకోణాలు చేస్తున్నారన్నారు. ఒక్క ఇళ్ల స్థలాల్లోనే రూ.6,500 కోట్ల కుంభకోణాలు చేశారు. మద్యం, సిమెంటు, ఇసుక రేట్లు పెంచేసి దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు 10% మాత్రమే ఇచ్చి, 90% వైసిపి నాయకులే స్వాహా చేస్తున్నారు. దేవాలయాలపై దాడులు, దేవుళ్ల విగ్రహాల విధ్వంసాలు చేస్తుంటే చోద్యం చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.