ANDHRA PRADESH TEACHERS MLC ELECTIONS 2021 KALPALATHA WON IN GUNTUR KRISHNA CONSTITUENCY SK
Andhra Pradesh: గుంటూరు-కృష్ణా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్పలత విజయం
కల్పలత
Andhra Pradesh Teachers MLC elections 2021 Results: గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానంలో కల్పలత విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బొడ్డు నాగేశ్వరరావుపై ఆమె విజయం సాధించారు.
ఏపీలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానంలో కల్పలత విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బొడ్డు నాగేశ్వరరావుపై ఆమె విజయం సాధించారు. విజయానికి కావాల్సిన 50 శాతం ఓట్లు (6,251) దాటడడంతో కల్పలత గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ 6,153 ఓట్లు రాకపోవడంతో.. రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 6,153 ఓట్లు సాధించడంతో కల్పలత విజయం సాధించారు. గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 19 మంది పోటీచేశారు. 12,554 మంది ఓటు హక్కును వినియోగించారు.
ఎన్నికల్లో విజయం అనంతరం కల్పలత మీడియాతో మాట్లాడారు. తన విజయం కోసం కృషి చేసిన అందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. ధన్యవాదాలు తెలిపారు. మహిళా ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు కల్పలత. తాను స్థానికురాలిని కాదనే అభిప్రాయం ఎక్కడా వినిపించలేదని.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు.
ఇఖ ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జీ ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి నారాయణ రావుపై ఆయన 1537 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 17,467 ఓట్లు ఉండగా..16,054 ఓట్లు పోలయ్యాయి. ఇందులో చెల్లని ఓట్లు పోగా.. షేక్ సాబ్జీకి 7,988 ఓట్లు పడ్డాయి. వైసీపీ బలపరిచిన నారాయణరావుకు 6,446 ఓట్లు పోలయ్యాయి. రెండో ప్రాధాన్యతా ఓట్లను లెక్కించాల్సిన అవసరం లేకుండానే షేక్ సాబ్జీ 50శాతం పైగా ఓట్లు సాధించారు. ఏలూరుకు చెందిన షఏక్ సాబ్జీ ప్రస్తుతం యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.