Home /News /politics /

ANDHRA PRADESH TDP PRESIDENT CHANDRABABU NAIDU GAVE CHANCE TO POLITICAL HEIRS OF PARTY LEADERS AK

టీడీపీ తొలి జాబితాలో “వారసుల” జోరు… పెద్దల త్యాగం

చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)

చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)

తన కుమారుడు నారా లోకేశ్ సహా... ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన అనేకమంది నేతల వారసులకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమ వారసులకు అవకాశం ఇవ్వాలని పార్టీలో ఉన్న సీనియర్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేల వినతికి టీడీపీ అధినేత సానుకూలంగా స్పందించారు.

ఇంకా చదవండి ...
    టీడీపీ విడుదల చేసిన అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాలో ఎక్కువమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకే జై కొట్టిన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు... ఈ సారి వారసులకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం కనిపించింది. తన కుమారుడు నారా లోకేశ్ సహా... ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన అనేకమంది నేతల వారసులకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తమ వారసులకు అవకాశం ఇవ్వాలని పార్టీలో ఉన్న సీనియర్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేల వినతికి టీడీపీ అధినేత సానుకూలంగా స్పందించారు. శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యేగా ఉన్న గౌతు శివాజీ కూతురు గౌరు శిరీషకు టికెట్ ఖరారైంది. చీపురుపల్లి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కిమిలి మృణాళినికి బదులుగా ఆమె తనయుడు నాగార్జునకు సీటిచ్చారు.

    చంద్రబాబు. రాజమండ్రి అర్బన్ సీటును, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు, ఎర్రన్నాయుడు కుమార్తె అయిన ఆదిరెడ్డి భవానీకి ఓకే చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ సీటును మాజీమంత్రి దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్‌కు ఇవ్వగా, విజయవాడ వెస్ట్ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూన్‌కు ఖరారు చేశారు. ప్రస్తుతం పత్తికొండ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న టీడీపీ సీనియర్ నేత, ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సీటును ఆయన కుమారుడు శ్యామ్ బాబుకు కేటాయించారు. ఇక ఈ ఎన్నికల్లో పరిటాల రవి వారసుడికి కూడా చంద్రబాబు లైన్ క్లియర్ చేశారు. రాప్తాడు నుంచి మంత్రి సునీతకు బదులుగా ఆయన కుమారుడు శ్రీరామ్‌కు టికెట్ ఖరారైంది.

    ఇక శ్రీకాళహస్తి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డికి టికెట్ ఓకే చేశారు చంద్రబాబు. నగరి సీటును దివంగత టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుమారుడైన భానుప్రకాశ్‌కు ఖరారు చేశారు. మరోవైపు తమ వారసుల కోసం మంత్రులు కేఈ కృష్ణమూర్తి, పరిటాల సునీల్, మాజీమంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మృణాళిని తమ సీటును త్యాగం చేశారు. ఇక మొదటి జాబితాలో పదిమంది వారసులకు చోటు దక్కగా... రెండో జాబితాలోనూ పలువురు వారసుల పేర్లు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి పోటీ చేయడం దాదాపుగా ఖాయమైంది.
    First published:

    Tags: Andhra Pradesh, Chandrababu naidu, Nara Lokesh, Tdp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు