Home /News /politics /

ANDHRA PRADESH TDP LEADER AND MLA PAYYAVULA KESHAV MAY SWITCH TO YSRCP NGS

TDP: పయ్యావుల సైలెన్స్ కు కారణం ఏంటి? ఆ నిర్ణయం తీసేసుకున్నారా? ముహూర్తం ఫిక్స్ అయ్యిందా..?

పయ్యావుల సైలెంట్ కు కారణం ఏంటి?

పయ్యావుల సైలెంట్ కు కారణం ఏంటి?

టీడీపీ ఫైర్ బ్రాండ్ గా.. చంద్రబాబుకు కుడి భుజంగా ఉండే పయ్యావుల కేశవ్ కు ఏమైంది..? ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు.. ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారా..? అందుకు శ్రావణ మాసంలో ముహూర్తం ఫిక్స్ చేశారా..?

  ఏపీలో టీడీపీ ఫైర్ బ్రాండ్లుగా గుర్తు తెచ్చుకున్న ఒక్కొక్కరు సైలెంట్ అవుతున్నారు. 2019లో అధికారం కోల్పోయిన తరువాత సీనియర్లు కేడర్ లో ధైర్యం నింపాలి. కానీ తెలుగుదేశం పార్టీలో అంతా రివర్స్ లో ఉంది. సీనియర్ నేతలు పార్టీని గాలికి వదిలేశారు. అందుకు తాజా ఫలితాలే నిదర్శనం. ప్రతిపక్ష పార్టీగా ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు లేవు. ఇలాంటి సమయంలో పార్టీ సీనియర్ నేత.. ఫైర్ బ్రాండ్ పయ్యావుల కేశవ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. సభలో మైక్ లేకుండానే పార్టీ వాయిస్ బలంగా వినిపించే నేతల్లో పయ్యావుల ఒకరు. ఉరవకొండ నుండి ఎవరు గెలిచినా ఆ పార్టీ అధికారంలోకి రాదనే సెంటిమెంట్ ఉంది. అది 2019 ఎన్నికల్లో మరోసారి నిజమైంది. ఆ సెంటిమెంట్ సంగతి ఎలా ఉన్నా..? ఆయన మౌనం వెనుక రాజకీయం ఉందనే ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ప్రతి పక్షంలో ఉన్నప్పుడు గతంలో చంద్రబాబుకు అండగా ఉన్నారు పయ్యావుల. పార్టీ వాయిస్ ను గట్టిగా వినిపించడంలో దిట్ట ఆయన. మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు. రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారా? ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తున్నారా..? ఆ రాజకీయ నిర్ణయానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారా..?

  1994, 2004, 2009 లో ఉరవకొండ నుండి టీడీపీ ఎమ్మెల్యేగా కేశవ్ గెలిచారు. శాసనసభలో నాడు ఉమ్మడి రాష్ట్రంలో ధూళిపాళ్ల నరేంద్ర.. పయ్యావుల కేశవ్.. నాగం జనార్ధన రెడ్డి.. అచ్చెన్నాయుడు.. యనమల వంటి వారు టీడీపీ మౌత్ పీస్ లుగా వ్యవహరించే వారు. 2014 లో అధికారంలోకి వచ్చిన సమయంలో కేశవ్ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అక్కడ వైసీపీ నుండి విశ్వేశ్వర రెడ్డి గెలుపొందారు. ఆ తరువాత పయ్యావులకు మండలి సభ్యుడుగా నియమించారు. పార్టీ కోసం అప్పటి వరకు పని చేసిన కేశవ్ కు మంత్రి పదవి మాత్రం ఇవ్వలేదు. ఇతర పార్టీ నుండి గెలిచిన వారికి మంత్రి పదవులు ఇచ్చి.. పార్టీ కోసమే పని చేసిన నరేంద్ర.. కేవశ్ వంటి వారికి పదవులు ఇవ్వకపోవటం పైన సొంత పార్టీలోనే ఆగ్రహం వ్యక్తం అయింది.

  ఇదీ చదవండి: ఏపీలో పరిస్థితిపై నవనీత్ కౌర్ ఆవేదన.. తెలుగువారి కోసం పోరాటం చేస్తానన్న ఎంపీ

  2019 లో టీడీపీ 23 సీట్లు గెలవగా.. అనంతపురంలో రెండు సీట్లు గెలిచింది. అందులో ఒకటి హిందూపూర్ నుండి బాలయ్య.. ఉరవకొండ నుండి పయ్యావుల కేశవ్. బాలయ్య ఎప్పటిలాగే తన పని తాను చేసుకుపోతున్నారు. ఆయన బావ చంద్రబాబును ఎదిరించి ఎలాంటి నిర్ణయం తీసుకోరు. ఇక పయ్యావుల మాత్రం గెలిచిన దగ్గర నుంచి మౌనంగానే ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పదువలు అనుభవంచిన వారు చాలా మంది ఉన్నారని.. కష్టాల్లో ఉన్న సమయంలోనే తాము గుర్తుకు వస్తామా అంటూ పయ్యావుల అనుచరులు ప్రశ్నిస్తున్నారు. దీంతో..కేశవ్ మనసులోని అభిప్రాయం గుర్తించిన చంద్రబాబు...ఆయనకు పీఏసీ ఛైర్మన్ గా అవకాశం ఇచ్చారు. అయినా..కేవశ్ మాత్రం యాక్టివ్ గా లేరు. శాసనసభలోనూ టీడీపీ పైన వైసీపీ ఎటాకింగ్ సమయంలో సహజంగానే ఎదురుదాడితో తిప్పికొట్టే కేశవ్ కేవలం సభలో హాజరు కోసమే వచ్చినట్లుగా వ్యవహరించారనే చర్చ ఉంది. ఇక, అమరావతి భూముల విషయంలోనై తన పైన వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇస్తూనే.. విచారణ చేయించుకోవాలని తన సహజ ధోరణికి భిన్నంగా మెత్తగా సమాధానం ఇచ్చారు. ఇప్పటికే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా రెండేళ్లు దాటి పోయింది. అయినా.. ఎక్కడా వైసీపీ పాలన పైన వ్యతిరేకంగా స్పందించిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి జగన్ పైనా ఎటువంటి విమర్శలు.. అరోపణలు లేవు. తన మిత్రుడు నరేంద్ర అరెస్ట్ అయినా.. స్పందించలేదు. నరేంద్ర విడుదల తరువాత వెళ్లి పరామర్శించారు కానీ, ఎక్కడా ప్రభుత్వం పైన వ్యాఖ్యలు చేయలేదు.

  ఇదీ చదవండి: నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్‌ దరఖాస్తుల స్వీకరణ.. ఆఖరు తేదీ ఎప్పుడంటే? ఇలా అప్లై చేయండి

  మరోవైపు వైసీపీ నేతల వ్యవహారం కూడా కొత్తగానే ఉంది. టీడీపీ నేతలు అందర్నీ టార్గెట్ చేస్తున్న వైసీపీ నేతలు పయ్యావులను పల్లెత్తు మాట అనడం లేదు. శాసనసభలోనూ కేశవ్ గురించి వైసీపీ బెంచ్ ల నుండి విమర్శలు లేవు. ఇదే సమయంలో ఉరవకొండలో విశ్వేశ్వర రెడ్డి తన పని తాను చేసుకుపోతు న్నారు. అయితే వైసీపీ హైకమాండ్ సూచనల మేరకే కేశవ్ కు వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. వైసీపీ ముఖ్య నేతల నుండి వచ్చిన సూచనల మేరకే జిల్లా వైసీపీ నేతలు సైతం కేశవ్ పైన వ్యతిరేకంగా మాట్లాడటం లేదని జిల్లాలో టాక్ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ కేశవ్ నామ్ కే వాస్తే పని చేసారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు అనధికారింగా వైసీపీకి దగ్గరయ్యారు. ఇక, ఇప్పుడు కేశవ్ సైతం అదే బాటలో నడుస్తారనే చర్చ టీడీపీలోనే జరుగుతోంది.

  ఇదీ చదవండి: ఆ కీలక నేతను లోకేష్ పక్కన పెట్టారా? పార్టీ పదవుల్లో త్వరలోనే మార్పులు తప్పవా?

  మరోవైపు కేశవ్ లాంటి నేతను వదులుకోవటానికి చంద్రబాబు సిద్దంగా లేరని పార్టీలో సీనియర్లు చెబుతున్న మాట. మంచి ముహూర్తంలో సీఎంను కలుస్తారంటూ ప్రచారం ఉంది. కేశవ్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని.. గుర్తింపు లేని పార్టీలో కొనసాగాల్సిన అవసరం లేదనే భావన వ్యక్తం అవుతోందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీంతో..కేశవ్ త్వరలో వైసీపీ లో చేరుతారంటూ ప్రచారం సాగుతోంది. మూడు రాజధానుల విషయంలో పార్టీ మొత్తం వ్యతిరేకించినా.. కేశవ్ మాత్రం స్పందించలేదు. ఇక, త్వరలోనే కేశవ్ సీఎం ను కలుస్తారనేది తాజా సమాచారం. ఇందుకు శ్రావణ మాసం ముహూర్తంగా ఫిక్స్ చేసినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నిజంగా కేశవ్ టీడీపీని వీడితే అది పార్టీకి ఊహించని డ్యామేజ్ అవుతుంది.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Tdp, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు