చంద్రబాబు ఓటమి కోసం యాగం... స్వామీజీ సంచలన ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి తారాస్థాయికి చేరుకుందని ఆరోపించిన స్వరూపానందేంద్ర... ప్రభుత్వ మార్పు కోసం త్వరలోనే ఏపీలో రాజ్యశ్యామల యాగం చేయబోతున్నట్టు వెల్లడించారు.

news18-telugu
Updated: February 20, 2019, 2:21 PM IST
చంద్రబాబు ఓటమి కోసం యాగం... స్వామీజీ సంచలన ప్రకటన
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేసుకుంటూ వ్యాఖ్యలు చేస్తున్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మరోసారి సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి తారాస్థాయికి చేరుకుందని ఆరోపించిన స్వరూపానందేంద్ర... ప్రభుత్వ మార్పు కోసం త్వరలోనే ఏపీలో రాజ్యశ్యామల యాగం చేయబోతున్నట్టు వెల్లడించారు. గుంటూరులోని గోరంట్లలో ఉన్న శ్రీ పద్మావతి ఆండాళ్ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి రిలిజియన్ సొసైటీ దేవస్థానంలో జరుగుతున్న సప్తదశ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలన గాడి తప్పిందని ఆరోపించిన స్వరూపానందేంద్ర... ఆలయ భూములు అన్యాక్రాంతమైనా పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ తన దగ్గర ఉన్నాయన్న స్వామీజీ... త్వరలోనే వాటిని బయటపెడతానని అన్నారు. టీటీడీ అధికారులతో పాటు సీఎం చంద్రబాబుపై కేసు పెడతానని వ్యాఖ్యానించిన స్వరూపానందేంద్ర... దీనిపై కోర్టులోనూ కేసు వేస్తానని తెలిపారు. కొంతకాలంగా ఏపీ ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో ఉన్న స్వరూపానందేంద్ర... చంద్రబాబు తీరుపై ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజ్యశ్యామల యాగం చేయించిన స్వరూపానందేంద్ర... తాజాగా ఏపీలోనూ అదే యాగం చేపడతానని (ప్రభుత్వ మార్పుకోసం) చెప్పడం ఆసక్తి రేపుతోంది.

First published: February 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com