హోమ్ /వార్తలు /రాజకీయం /

ఏపీలో రాష్ట్రపతి పాలనకు దారితీసేలా పరిస్థితులు.. గవర్నర్ జోక్యం చేసుకోవాలి: యనమల డిమాండ్

ఏపీలో రాష్ట్రపతి పాలనకు దారితీసేలా పరిస్థితులు.. గవర్నర్ జోక్యం చేసుకోవాలి: యనమల డిమాండ్

యనమల రామకృష్ణుడు, సీఎం జగన్

యనమల రామకృష్ణుడు, సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్ర గవర్నర్ తక్షణమే స్పందించాలన్నారు. కానిస్టిట్యూషన్ బ్రేక్ డౌన్ ను అడ్డుకోవాల్సిన బాధ్యత గవర్నర్ దేనని చెప్పారు. ఆర్టికల్ 243ఏ, ఆర్టికల్ 243కె(1) ప్రకారం ఎన్నికల నిర్వహణపై పూర్తి అధికారాలు ఎన్నికల సంఘానివేనని యనమల చెప్పారు.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జోక్యం చేసుకోవాలని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఆర్టికల్ 243ఏ, ఆర్టికల్ 243కె(1) ప్రకారం ఎన్నికల నిర్వహణ అధికారం ఈసీదేనని ఆయన స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికలకు కావాల్సిన ఉద్యోగులను కేటాయించేలా చూడాల్సింది కూడా గవర్నరేనని యనమల అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కె(3) కూడా చెబుతోందని ఆయన గుర్తు చేశారు. ఇక రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఆర్టికల్ 356ను (రాష్ట్రపతి పాలన) అట్రాక్ట్ చేసేలా ఉన్నాయని యనమల కామెంట్ చేయడం సంచలనంగా మారింది. ఎన్నికల నిర్వహణకు సహకరించేది లేదని మంత్రులు చెప్పడం దేశచరిత్రలో లేదని, ఎన్నికలకు సహకరించమని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పడం ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. ఈ మేరకు ఓ ప్రకటనలో ఆయన ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

‘మద్యం క్యూల నిర్వహణకు లేని అభ్యంతరాలు, పంచాయితీ ఎన్నికలకు ఉంటాయా?. కోవిడ్ ప్రభావం ఉందని 2022జూన్ దాకా స్థానిక ఎన్నికలు జరపరా?. ప్రతిపక్షాలపై దాడులు, అన్నివర్గాల ప్రజలపై దౌర్జన్యాలు, చివరికి ఆలయాల ధ్వంసాలు. ప్రజల్లో ఆగ్రహం చూసే ఎన్నికల నిర్వహణకు సీఎం జగన్ రెడ్డి ఆటంకాలు సృష్టిస్తున్నారు. స్థానిక ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం జగన్ రెడ్డి అండ్ కో కు లేకనే ఈ జగన్నాటకం ఆడుతోంది. వైసీపీ ప్రభుత్వ రాజ్యాంగ ధ్వంసం (కానిస్టిట్యూషన్ బ్రేక్ డౌన్)ను అడ్డుకోవాలి. శాంతియుతంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలి.’ అని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్ర గవర్నర్ తక్షణమే స్పందించాలన్నారు. కానిస్టిట్యూషన్ బ్రేక్ డౌన్ ను అడ్డుకోవాల్సిన బాధ్యత గవర్నర్ దేనని చెప్పారు. ఆర్టికల్ 243ఏ, ఆర్టికల్ 243కె(1) ప్రకారం ఎన్నికల నిర్వహణపై పూర్తి అధికారాలు ఎన్నికల సంఘానివే...ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర లేదన్నారు. ‘పంచాయితీ ఎన్నికలపై ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఎలక్షన్ కమిషనర్ ఎన్నికల నిర్వహణపై గవర్నర్ ను అభ్యర్ధించినప్పుడు కావాల్సిన ఉద్యోగులను కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కాబట్టి పంచాయతీ ఎన్నికలకు కావాల్సిన ఉద్యోగులను కేటాయించేలా చూడాల్సింది గవర్నరే. చట్ట నిర్మాణ వ్యవస్థ( లెజిస్లేచర్), న్యాయ వ్యవస్థ (జ్యుడిసియరీ), పరిపాలనా వ్యవస్థ (అడ్మినిస్ట్రేషన్), మీడియా, పోలీసు వ్యవస్థ అన్నింటి నాశనమే ధ్యేయంగా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.’ అని యనమల ప్రకటనలో మండిపడ్డారు.

అమెరికా ఎన్నికలు, బీహార్ ఎన్నికలు, అనేక ఉపఎన్నికలు, రేపు తమిళనాడు ఎన్నికలకు అడ్డుకాని కరోనా ఏపిలోనే స్థానిక ఎన్నికలకు ఆటంకమా? అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. పాఠశాలలు నడపడానికి, ముఖ్యమంత్రి పుట్టిన రోజు, మంత్రుల పెళ్లి రోజులకు అడ్డంకాని కరోనా స్థానిక ఎన్నికలకు అడ్డమా? అని నిలదీశారు. మద్యం దుకాణాల వద్ద క్యూ కట్టడం, వైసీపీ సంబరాలు, పట్టాల పండుగలకు అడ్డం కాని కరోనా పంచాయితీ ఎన్నికలకు అడ్డమా? అని ప్రశ్నించారు. 2022 జూన్ దాకా కోవిడ్ ప్రభావం ఉంటుందని కొన్ని నివేదికలు ఉన్నాయని, ఈ లెక్కన అప్పటిదాకా స్థానిక ఎన్నికలు జరపరా అని యనమల రామకృష్ణుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

First published:

Tags: Andhra Pradesh, Yanamala Rama Krishnudu

ఉత్తమ కథలు